న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషబ్ పంత్ క్యాచ్: డేవిడ్ వార్నర్‌కు పట్టేసిన పక్కటెముకలు

నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పరుగుల తేడాతో విజయ

By Nageshwara Rao

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్, మ్యాచ్ 21: సన్‌రైజర్స్ జైత్రయాత్ర, ఢిల్లీపై ఘన విజయంఐపీఎల్, మ్యాచ్ 21: సన్‌రైజర్స్ జైత్రయాత్ర, ఢిల్లీపై ఘన విజయం

ఈ సీజన్‌లో మధ్యలో రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైనప్పటికీ, ఆ తర్వాత ను కొనసాగిస్తోంది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్ మొదటి నుంచే దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో యువీ వేసిన పదో ఓవర్‌లో రిషబ్‌ పంత్‌ ఇచ్చిన క్యాచ్‌ను వార్నర్‌ ప్రమాదకరరీతిలో అందుకున్నాడు.

ఫోర్ లైన్ వద్ద పూర్తిగా వెనుకకు పడిపోతూ ఈ క్యాచ్‌‌ను ఒడిసిపట్టాడు. ఈ సందర్భంగా వార్నర్ బాధ పడుతున్నట్టు టీవీ కెమెరాల్లో కనిపించింది. అయితే మ్యాచ్‌ అయిపోయేవరకు ఈ బాధను ఓర్చుకున్న వార్నర్‌, మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని వెల్లడించాడు.

SRH vs DD: I hurt myself on the rib cage, reveals David Warner

ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టులో యువ ఆటగాళ్లు సంజూ శాంసన్, రిషబ్‌ పంత్ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ క్యాచ్ ఎంతో విలువైనది కావడంతో కష్టమైన వార్నర్ దానిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో పక్కటెముకల్లో గాయమైందని వార్నర్ వెల్లడించాడు.

ఐపీఎల్, మ్యాచ్ 21: సన్‌రైజర్స్ Vs ఢిల్లీ మ్యాచ్ హైలెట్స్ఐపీఎల్, మ్యాచ్ 21: సన్‌రైజర్స్ Vs ఢిల్లీ మ్యాచ్ హైలెట్స్

ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసల్లో ముంచెత్తారు. కేన్‌ విలియమ్సన్‌, శిఖర్‌ ధావన్‌ ఈ మ్యాచ్‌లో గొప్ప ఆటతీరు కనబర్చారని వార్నర్ కితాబిచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన విలియమ్సన్‌ 89, ధావన్‌ 70 పరుగులతో రాణించడంతో హైదరాబాద్‌ 191 పరుగులు చేసింది.

192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులుచేసి ఓటమిపాలైంది. బ్యాట్సమెన్‌తోపాటు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారని, అందువల్లే ఈ విజయం వరించిందని వార్నర్ చెప్పారు.

ముఖ్యంగా చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 24 పరుగులు అవసరం కాగా, సన్ రైజర్స్ బౌలర్ కౌల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 8 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. మరోవైపు 15 పరుగుల తేడాతో ఓడిపోవడంపై జహీర్‌ ఖాన్‌ విచారం వ్యక్తం చేశాడు. రెండు జట్లు బాగా ఆడాయని ఆయన చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X