న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5 మ్యాచ్‌ల కోసం 5వేల కి.మీ ప్రయాణించిన సన్‌రైజర్స్

SRH Juggernaut Running Out of Fuel After Covering 5,000 Km For Last 5 Matches

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సందిగ్ధతల నడుమ బరిలోకి దిగి అంచనాలకు అనుగుణంగా రాణించింది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో జట్టు నుంచి నిషేదానికి గురవడంతో డేవిడ్ వార్నర్ బదులుగా కేన్ విలియమ్‌సన్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. దీంతో కొత్త కెప్టెన్ సరిగా రాణిస్తాడా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. వీటన్నిటికీ ధీటుగా సమాధానమిస్తూ.. పాయింట్ల పట్టికలో లీగ్ దశ ముగిసేంతవరకూ టాప్ 1గా కొనసాగింది.

చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై

చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై

అంతేకాకుండా పాయింట్ల పట్టికలో నంబర్-1గా ప్లేఆఫ్ దశలోకి అడుగుపెట్టింది. ప్లేఆఫ్ బెర్త్‌ను ముందుగానే ఖాయం చేసుకున్న సన్‌రైజర్స్ తప్పని పరిస్థితుల్లో చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ముఖ్యంగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో అనూహ్యంగా ఓడటంతో.. ఈడెన్‌గార్డెన్స్‌లో రెండో క్వాలిఫైయర్ ఆడాల్సిన పరిస్థితి తలెత్తింది.

5 మ్యాచ్‌ల్లో 4 గెలుపొందిన కోల్‌తాతో

5 మ్యాచ్‌ల్లో 4 గెలుపొందిన కోల్‌తాతో

దీంతో ఫైనల్ మ్యాచ్ లో అర్హత పొందేందుకు వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన సన్‌రైజర్స్.. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలుపొందిన కోల్‌తాతో పోటీ పడుతోంది. ఈ మ్యాచ్ లో గెలుపొందితేనే చెన్నైతో పోటీపడగలిగేది.

5 మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్ దాదాపు 5 వేల కి.మీ

5 మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్ దాదాపు 5 వేల కి.మీ

అయితే ఆఖరుగా ఆడిన ఐదు మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్ దాదాపు 5 వేల కి.మీ. ప్రయాణించింది. ఢిల్లీతో మ్యాచ్ పూర్తయిన తర్వాత సన్‌రైజర్స్.. చెన్నైతో మ్యాచ్ ఆడేందుకు పుణే వెళ్లింది. ఢిల్లీ, పుణేల మధ్య దూరం 1181 కి.మీ. తర్వాత ఆర్‌సీబీతో మ్యాచ్ కోసం బెంగళూరు (736 కి.మీ.) వెళ్లింది. మళ్లీ బెంగళూరు నుంచి 501 కి.మీ ప్రయాణించి హైదరాబాద్‌లో కోల్‌కతాతో తలపడింది.

ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌‌కు చేసిన ప్రయాణం అదనం

ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌‌కు చేసిన ప్రయాణం అదనం

తర్వాత క్వాలిఫైయర్-1 కోసం 622 కి.మీ. ప్రయాణించి ముంబై వెళ్లింది. మళ్లీ రెండో క్వాలిఫైయర్ కోసం 1657 కి.మీ. ప్రయాణించి కోల్‌కతా చేరుకుంది. ఓవరాల్‌గా ఈ ఐదు మ్యాచ్‌ల కోసం 4700 కి.మీ దూరం ప్రయాణించింది. దీనికి ఎయిర్‌పోర్ట్ నుంచి బస చేసిన హోటల్‌‌కు, స్టేడియానికి చేసిన ప్రయాణం అదనం.

Story first published: Friday, May 25, 2018, 16:39 [IST]
Other articles published on May 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X