న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జెర్సీ నోస్ నో జెండర్': కోహ్లీ క్యాంపెయిన్‌కు అనూహ్య మద్దతు

Virat Kohli's 'Jersey Knows No Gender' Campaign Gets Tremendous Support | Oneindia Telugu
Sports Fraternity Joins Kohlis Jersey Knows No Gender Campaign

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో ఆరంభించిన "జెర్సీ నోస్ నో జెండర్"‌కు సోషల్ మీడియాలో స్పోర్ట్స్ సెలబ్రెటీల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వెస్టిండిస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ టీ20లో భారత మహిళా క్రికెట్ టీమ్‌కు మద్దతు తెలపడానికి ఈ క్యాంపెయిన్‌ను కోహ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

<strong>ఆత్మగౌరవానికి ఓ హద్దు ఉంటుంది: ఆసీస్ గడ్డపై దూకుడుకి అర్ధం చెప్పిన కోహ్లీ</strong>ఆత్మగౌరవానికి ఓ హద్దు ఉంటుంది: ఆసీస్ గడ్డపై దూకుడుకి అర్ధం చెప్పిన కోహ్లీ

తాజాగా విరాట్ కోహ్లీ "జెర్సీ నోస్ నో జెండర్"కు భారత స్టార్ షూటర్ హీనా సిద్ధూ మద్దతు తెలిపింది. కండలు బిగించిన ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి భారత మహిళా క్రికెట్ జట్టుకు మద్దతు తెలిపింది. ఈ క్యాంపెయిన్‌‌లో ఇప్పటికే సానియా మిర్జా, దీపికా పల్లికల్, సైనా నెహ్వాల్, మేరీ కోమ్, హర్మన్ ప్రీత్ కౌర్, వినేష్ ఫోగట్ తదితరులు మద్దతు తెలిపారు.

భారత క్రికెటర్లు కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ సైతం ఈ క్యాంపెయిన్‌కు మద్దతు పలికిన వారిలో ఉన్నారు. బాలీవుడ్ హీరో సింగ్ రాజ్‌పుత్, బిలియర్డ్స్ స్టార్ పంకజ్ అద్వానీ సైతం భారత మహిళల జట్టుకు తమ మద్దతుని ప్రకటించారు. కాగా, హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు ఐసీసీ వరల్డ్ టీ20లో సెమీస్‌కు చేరుకుంది.

వరుస విజయాలతో గ్రూప్‌-బి నుంచి భారత్, ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించాయి. ఇక, గ్రూప్‌-ఏ నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ జట్లు సెమీస్‌ చేరుకున్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం గ్రూప్ ఏ1 vs బీ2తో, గ్రూప్ ఏ2 vs గ్రూప్ బీ1 తలపడాల్సి ఉంది. దీంతో సెమీస్‌-1లో వెస్టిండీస్‌ vs ఆస్ట్రేలియా, సెమీస్‌-2లో భారత్‌ vs ఇంగ్లాండ్‌ జట్లు తలపడనున్నాయి.

గతేడాది వన్డే వరల్డ్ కప్ పైనల్లో భారత్‌ vs ఇంగ్లాండ్‌ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దీంతో గత వన్డే వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమికి ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. నవంబర్‌ 22వ తేదీన రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ గురువారం ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఐసీసీ వరల్డ్ టీ20లో భారత మహిళల జట్టుకు మద్దతు తెలిపేందుకు గాను "జెర్సీ నోస్ నో జెండర్" క్యాంపెయిన్ స్టార్ చేశాడు.

హీనా సిద్ధూ

హీనా సిద్ధూ

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రారంభించిన "జెర్సీ నోస్ నో జెండర్"కు సపోర్ట్ చేస్తున్న భారత స్టార్ షూటర్ హీనా సిద్ధూ.

దీపికా పల్లికల్

దీపికా పల్లికల్

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రారంభించిన "జెర్సీ నోస్ నో జెండర్"కు సపోర్ట్ చేస్తున్న భారత స్క్వాష్ క్వీన్ దీపికా పల్లికల్.

సానియా మీర్జా

సానియా మీర్జా

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రారంభించిన "జెర్సీ నోస్ నో జెండర్"కు మద్దతు తెలిపిన సానియా మీర్జా.

మేరీ కోమ్

మేరీ కోమ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రారంభించిన "జెర్సీ నోస్ నో జెండర్"కు మద్దతు తెలిపిన మేరీ కోమ్.

వినేష్ ఫోగట్

వినేష్ ఫోగట్

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రారంభించిన "జెర్సీ నోస్ నో జెండర్"కు మద్దతు తెలిపిన వినేష్ ఫోగట్.

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రారంభించిన "జెర్సీ నోస్ నో జెండర్"కు మద్దతు తెలిపిన సైనా నెహ్వాల్.

రిషభ్ పంత్

రిషభ్ పంత్

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రారంభించిన "జెర్సీ నోస్ నో జెండర్"కు మద్దతు తెలిపిన రిషభ్ పంత్.

Story first published: Tuesday, November 20, 2018, 18:52 [IST]
Other articles published on Nov 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X