న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియా టూర్‌కు ముందే సౌతాఫ్రికాకు గట్టి షాక్‌.. గాయంతో స్టార్ పేసర్ దూరం

South Africa Pacer Kagiso Rabada is out of ODI series against Australia and India

కేప్‌టౌన్‌: భారత్‌తో మూడు వన్డేల సిరీస్ ముంగిట సౌతాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్‌ కగిసో రబడ కండరాల గాయంతో జట్టుకు దూరమయ్యాడు. రబడకు కనీసం నాలుగు వారాలు విశ్రాంతి అవసరమని టీమ్‌ మెడికల్‌ డైరక్టర్‌ డాక్టర్‌ షుయబ్‌ మంజ్రా స్పష్టం చేసిన నేపథ్యంలో అతను ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌తో పాటు భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కెప్టెన్‌ అయినంత మాత్రాన ఇంత బిత్తిరి నిర్ణయమా? కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్కెప్టెన్‌ అయినంత మాత్రాన ఇంత బిత్తిరి నిర్ణయమా? కోహ్లీపై ఫ్యాన్స్ ఫైర్

ఆసీస్‌తో కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టీ20లో గాయపడ్డ రబడ.. ఆ సిరీస్‌ మిగతా మ్యాచ్‌ల్లో పాల్గొనలేదు. వన్డే సిరీస్‌ నాటికి అందుబాటులోకి వస్తాడని భావించినా అదీ జరగలేదు. సఫారీలతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ఆసీస్‌ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మూడు వన్డేల సిరీస్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది. మార్చి 7వ తేదీతో ఈ సిరీస్‌ ముగియనుంది.

అనంతరం దక్షిణాఫ్రికా జట్టు మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య మార్చి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ మూడు వన్డేలు జరగనున్నాయి. మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తరఫున ఈ రబడ బరిలోకి దిగనున్నాడు. గతేడాది 12 మ్యాచ్‌లు ఆడిన రబడ 25 వికెట్లు పడగొట్టాడు. అతని బెస్ట్ 4/21కాగా.. రెండు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్‌ను మార్చి 30న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్‌కి ముందు నిర్వహించే ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గితే కగిసో రబడ తుది జట్టులోకి వస్తాడు.

Story first published: Saturday, February 29, 2020, 17:31 [IST]
Other articles published on Feb 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X