న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021 పూర్తిచేయకుంటే రూ. 2500 కోట్లు నష్టపోతాం: గంగూలీ

Sourav Ganguly says If IPL 2021 not complete BCCI will loss INR 2500 crores

ముంబై: ఒకవేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీలోని మిగతా మ్యాచ్‌లను నిర్వహించకుంటే సుమారు 2500 కోట్ల వరకు నష్టం రావొచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. పలు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతుండడంతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ మంగళవారం నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల లీగ్‌ చరిత్రలో ఇలా అర్ధాంతరంగా ముగియడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌ 9న ఆరంభమైన 2021 సీజన్‌లో మొత్తం 60 మ్యాచ్‌లకు గాను 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి.

సామ్‌.. ఇంటికెళ్లి బాగా చదువుకో! చాక్లెట్లు తినకుండా.. జనరల్‌ నాలెడ్జ్‌ పెంచుకో! రైనా ట్రోల్స్!సామ్‌.. ఇంటికెళ్లి బాగా చదువుకో! చాక్లెట్లు తినకుండా.. జనరల్‌ నాలెడ్జ్‌ పెంచుకో! రైనా ట్రోల్స్!

ప్రస్తుత కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, టీ20 ప్రపంచకప్ కారణంగా ప్రస్తుతం బిజీ షెడ్యూల్ ఉన్న కేలెండర్‌లో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను పూర్తిచేసేందుకు అవసరమైన టైమ్ స్లాట్ దొరకడం కష్టమైన పనేనని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. టోర్నీలోని మిగతా మ్యాచ్‌లను కనుక నిర్వహించకుంటే జరిగే నష్టం రూ. 2 వేల కోట్లకు పైమాటేనని పేర్కొన్నారు. ఇక సీజన్‌ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్ల నుంచి రావాల్సిన ఆదాయానికి పెద్ద గండి పడింది.

'ఐపీఎల్‌ 2021ను వాయిదా వేసి కొన్ని రోజులు మాత్రమే అయింది. టీ20 ప్రపంచకప్‌నకు ముందు లీగ్‌లోని మిగతా మ్యాచ్‌లను పూర్తి చేసేందుకు విండో అందుబాటులో ఉందో లేదో చూడాలి. ఇతర బోర్డులతోనూ మాట్లాడాలి. ఇలా ఐపీఎల్ నిర్వహణపై ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కదానిపై చర్చించాల్సి ఉంది. ఐపీఎల్ వాయిదా పెద్ద ఎదురుదెబ్బ అని అనుకోవడం లేదు. గతేడాది వింబుల్డన్ , ఒలింపిక్స్ కూడా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనమేమీ చేయలేము. టీ20 ప్రపంచకప్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి' అని దాదా టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

కరోనా సంక్షోభ సమయంలో ఐపీఎల్‌ 2021ను నిర్వహించడం పట్ల బీసీసీఐపై వస్తున్న విమర్శలను సౌరవ్ గంగూలీ కొట్టిపారేశారు. తాము ఐపీఎల్‌ స్వదేశంలో నిర్వహించాలని నిర్ణయించినప్పుడు భారత్‌లో కరోనా కేసులు అత్యల్పంగా ఉన్నాయని, చివరి మూడు వారాలుగానే అనూహ్యంగా పెరిగాయని అన్నారు. రేపు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని దాదా చెప్పారు. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు నాలుగు ఇంగ్లిష్‌ కౌంటీ క్లబ్‌లు కూడా ముందుకొచ్చాయి.

Story first published: Friday, May 7, 2021, 21:31 [IST]
Other articles published on May 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X