న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు నెలల సమయం.. మూడు రంజీ మ్యాచ్‌లు ఇవ్వండి.. మళ్లీ టెస్ట్‌ క్రికెట్‌లో ఇరగదీస్తా: గంగూలీ

Sourav Ganguly Says Give me three months and three Ranji games, I’ll score runs for India in Tests

న్యూఢిల్లీ: ట్రైనింగ్‌కు మూడు నెలల సమయం.. కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇస్తే మరోసారి భారత్ తరఫున టెస్ట్‌ల్లో చెలరేగుతానని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. 12 ఏళ్ల క్రితం భారత్ తరఫున చివరిసారిగా ఆడిన దాదా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను 2011లో ముగించాడు. అయినా తనకు కొంత సమయం ఇస్తే మళ్లీ మైదానంలో పరుగులు చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

ఇప్పుడైనా రాణిస్తా..

ఇప్పుడైనా రాణిస్తా..

బెంగాలీ దినపత్రిక ‘సంగ్‌బద్ ప్రతీదిన్'‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ చివరి రోజులను దాదా గుర్తు చేసుకున్నాడు. ‘వన్డేల్లో నాకు మరో రెండు సిరీస్‌లు ఆడే అవకాశం ఇస్తే మరిన్నీ పరుగులు చేసేవాడిని. నాగ్‌పూర్‌లో నా ఆటకు గుడ్‌బై చెప్పకుండా ఉండి ఉండే.. తరువాత జరిగిన రెండు టెస్ట్‌ సిరీస్‌ల్లో రాణించేవాడిని. అంతేందుకు ఇప్పుడు నాకు ఓ ఆరు నెలల సమయం, మూడు రంజీ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వండి. మళ్లీ భారత్ తరఫున టెస్ట్‌ల్లో రాణిస్తా. ఆరు నెలలు కూడా కాదు.. మూడు నెలల సమయం ఇచ్చినా పరుగులు చేస్తా.'అని గంగూలీ తెలిపాడు.

ఫామ్‌లో ఉన్నప్పుడే తప్పించారు..

ఫామ్‌లో ఉన్నప్పుడే తప్పించారు..

‘ఆడటానికి మీరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా.. నా నమ్మకాన్ని మాత్రం పోగట్టలేరు కదా?'అని ఈ బీసీసీఐ బాస్ ప్రశ్నించాడు. ఇక తాను సూపర్ ఫామ్‌లో ఉన్నప్పుడే జట్టు నుంచి తప్పించారని దాదా పేర్కొన్నాడు. ‘నమ్మశక్యం కానీ విషయం ఏంటంటే..2007-08 క్యాలండర్ ఇయర్‌లో నావే అత్యధిక పరుగులు. కానీ అనూహ్యంగా నన్ను పక్కన పెట్టారు. బాగ ఆడుతున్నప్పుడే తీసేస్తే ఇంకేం నిరూపించుకుంటాం'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

చాపెల్‌తో గొడవ..

చాపెల్‌తో గొడవ..

గ్రేగ్ చాపెల్ టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అనూహ్యంగా కెప్టెన్సీతో పాటు 2005లో జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అనంతరం దేశవాళీలో రాణించి మరసటి ఏడిదికే సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపికయ్యాడు. బ్యాటింగ్‌లో రాణించాడు. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ కూడా దాదాను మెచ్చుకున్నాడు. అయితే దాదాను తొలగించాలని బీసీసీఐకి చాపెల్ చేసిన మెయిల్ లీకవ్వడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. భారత పార్లమెంట్‌ను స్థంభింప చేసింది.

వీడ్కోలు పలికినా..

వీడ్కోలు పలికినా..

ఇక 2007-08 ఆస్ట్రేలియా పర్యటనకు ద్రవిడ్‌తో పాటు గంగూలీని ఎంపిక చేయలేదు. ఆ మరసటి ఏడాదే దాదా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇంటర్నేషన్ క్రికెట్ నుంచి తప్పుకున్నా డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్‌లో 2012 వరకు ఆడాడు. భారత్ తరఫున 113 టెస్ట్‌లు, 311 మ్యాచ్‌లు ఆడిన దాదా.. సంప్రదాయక ఫార్మాట్‌లో 42.17 సగటుతో 7212 రన్స్ చేశాడు. ఇందులో 16 సెంచరీలున్నాయి. ఇక వన్డేల్లో 41.02 సగటు, 22 సెంచరీలతో 11363 రన్స్ చేశాడు.

Story first published: Friday, July 17, 2020, 15:10 [IST]
Other articles published on Jul 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X