న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో No. 4 స్పాట్: పాంటింగ్ ఛాయిస్ ఎవరో తెలుసా?

IPL 2019 : Sourav Ganguly, Ricky Ponting Want Rishabh Pant To Be India's No.4 At World Cup
Sourav Ganguly, Ricky Ponting name their choices for India’s No. 4 in World Cup 2019

హైదరాబాద్: యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ భారత జట్టులో నాలుగో స్థానానికి అర్హుడని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. 2015 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాను No. 4 స్థానం పెద్ద సమస్యగా మారింది. ఈ స్థానంలో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లు ఆడినప్పటికీ ఎవరూ ఆ స్థానంలో కుదురుకోలేదు.

No.4 రేసులో నలుగురు: ఐపీఎల్‌లో ప్రదర్శన బట్టే వరల్డ్‌కప్‌కు ఎంపిక!No.4 రేసులో నలుగురు: ఐపీఎల్‌లో ప్రదర్శన బట్టే వరల్డ్‌కప్‌కు ఎంపిక!

తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ అనంతరం మళ్లీ నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధం ఏర్పడింది. దీంతో మళ్లీ No. 4పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్ భారత జట్టులో నాలుగో స్థానానికి పంత్ అర్హుడని అన్నాడు.

పాంటింగ్ మాట్లాడుతూ

పాంటింగ్ మాట్లాడుతూ

మంగళవారం గంగూలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న పాంటింగ్ మాట్లాడుతూ "నాకు అవకాశమిస్తే మరో ఆలోచన లేకుండా పంత్‌కు భారత జట్టులో చోటు కల్పిస్తా. అతడిని ఒక బ్యాట్స్‌మన్‌గానే ఆడిస్తా. నాలుగో స్థానంలో దింపుతా. అలాంటి ప్రతిభావంతులు ప్రపంచకప్‌ అందించగలరు. టోర్నీలో అతను కీలకమవుతాడు" అని అన్నాడు.

పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి

పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి

మరోవైపు రిషబ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించాలన్న పాంటింగ్‌ ఆలోచనతో గంగూలీ సైతం ఏకీభవించాడు. మరోవైపు ఐపీఎల్ ప్రదర్శనను బట్టే వరల్డ్‌కప్ టీమ్ ఎంపిక ఉంటుందని బోర్డు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. మే30న ప్రారంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌కు ఏప్రిల్ 20న సెలక్టర్లు 15మందితో కూడిన జట్టుని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

ఐపీఎల్ 2019 సీజన్ ఎంతో కీలకం

ఐపీఎల్ 2019 సీజన్ ఎంతో కీలకం

ఐపీఎల్ 2019 సీజన్ ఎంతో కీలకం కానుందని ఆ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ఐపీఎల్‌లో రాణించిన వాళ్లకు వరల్డ్‌కప్‌లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనే అన్ని స్థానాలకు ప్లేయర్స్ దొరుకుతారు అని భావించినా.. నాలుగో స్థానంలో మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ స్థానంలో ఎవరూ రాణించలేదు" అని అన్నారు.

ఈ స్థానం కోసం నలుగురు పోటీ

ఈ స్థానం కోసం నలుగురు పోటీ

"ప్రస్తుతానికి ఈ స్థానం కోసం నలుగురు పోటీ పడుతున్నారు. అజ్యింకె రహానే, అంబటి రాయుడు, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ NO.4 స్థానం రేసులో ఉన్నారు. వీళ్లంతా ఐపీఎల్‌లో ఎలా ప్రదర్శిస్తారనే దానిపై వరల్డ్‌కప్ జట్టు ఎంపిక ఆధారపడి ఉంటుంది. నాలుగో స్థానానికి ఇంకా ఏ ఆటగాడు కూడా అధికారికంగా ఖరారు కాలేదు. ఈ స్థానం కోసం ఇంకా పోటీ ఉంది" అని ఆయన తెలిపారు.

Story first published: Wednesday, March 20, 2019, 9:51 [IST]
Other articles published on Mar 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X