న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు

By Nageshwara Rao
Some Interesting Facts About Ab De Villiers you probably did not know

హైదరాబాద్: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఏబీ డివిలియర్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం...


* ఏబీ డివిలియర్స్ పూర్తి పేరు అబ్రహం బెంజమిన్ డివిలియర్స్.


* వన్డేల్లో 50కి పైగా ఇన్నింగ్స్‌ల్లో 50కిపైగా యావరేజి, వందకుపైగా స్ట్రైక్ రేట్‌ సాధించిన ఒక్కే ఒక్క ఆటగాడు.


* 25వ ఓవర్ తర్వాత వచ్చి 5 వన్డే సెంచరీలు చేసిన ఒకే ఆటగాడు ఏబీ డివిలియర్స్.


* టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ రెండేసి సెంచరీలు చేశారు.


* నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 21 వన్డే సెంచరీలు సాధించిన ఆటగాడు. ఏబీ తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ 17 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.


* వెస్టిండిస్‌తో జరిగిన వన్డేలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. కేవలం 31 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డు నెలకొల్పాడు.


* ఓ టెస్టులో వికెట్ కీపర్‌గా పది మందికిపైగా ఆటగాళ్లను పెవిలియన్ పంపడంతో పాటు సెంచరీ సాధించిన ఒకే ఒక్క వికెట్ కీపర్.


* ఐదో నెంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 62.11 టెస్టు యావరేజితో 2,500కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో ఏబీ ముందున్నాడు. 60.80 సగటుతో మైకెల్ క్లార్క్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.


* వన్డేల్లో అత్యంత వేగవంతమైన, టెస్టుల్లో అత్యంత నెమ్మదిగా ఆడిన రికార్డు కూడా డివిలియర్స్‌పైనే ఉంది.


* 2015లో వెస్టిండిస్‌పై 44 బంతుల్లో 9 ఫోర్లు, 16 సిక్సర్లతో 338.63 స్ట్రైక్ రేటుతో 149 పరుగులు చేశాడు. అదే ఏడాది టీమిండియాతో జరిగిన టెస్టులో 297 బంతులు ఎదుర్కొని 14.48 స్ట్రైక్ రేటుతో 43 పరుగులు చేశాడు.


* 2004లో ఇంగ్లాండ్‌పై టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డివిలియర్స్‌.. చివరగా ఈ ఏడాది ఏప్రిల్‌ 3న ఆస్ట్రేలియాతో జొహానెస్‌బర్గ్‌లో తన చివరి టెస్టు ఆడాడు.


* 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు.


* అంతర్జాతీయ క్రికెట్లో 20,014 పరుగులు చేశాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. పరిమిత ఓవర్లలో క్రికెట్‌ చరిత్రలోనే ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లో ఒకడు.


Story first published: Thursday, May 24, 2018, 23:16 [IST]
Other articles published on May 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X