న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంధాన హాఫ్ సెంచరీ: కివీస్ గడ్డపై మహిళల జట్టు చరిత్ర

Smriti Mandhana, Mithali Raj and Jhulan Goswami win India ODI series vs New Zealand

హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై భారత అమ్మాయిలు మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. మౌంట్ మాంగనూయ్ వేదికగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మిథాలీ సేన కైవసం చేసుకుంది.

<strong>ICC Twenty20 World Cup 2020: షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ</strong>ICC Twenty20 World Cup 2020: షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ

ఇప్పటికే పురుషుల జట్టు వరుస విజయాలతో 3-0తో సిరీస్‌ కైవసం చేసుకోగా.. తాజాగా భారత మహిళల జట్టు సైతం సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించారు.

162 పరుగుల విజయ లక్ష్యంతో

162 పరుగుల విజయ లక్ష్యంతో

న్యూజిలాండ్ నిర్దేశించిన 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఈ సిరిస్‌లో బాగంగా తొలి వన్డేలో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ స్మృతి మంధాన రెండో వన్డేలోనూ 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.

63 పరుగులతో నౌటౌట్‌గా

63 పరుగులతో నౌటౌట్‌గా

మరోవైపు కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం 63 పరుగులతో నౌటౌట్‌గా నిలిచింది. ఓపెనర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ డకౌట్‌ కాగా.. ఫస్ట్‌ డౌన్‌ బ్యాటర్‌ దీప్తి శర్మ(8) తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో 15 పరుగులకే రెండు వికెట్లు పడిపోయిన దశలో క్రీజులోకి వచ్చిన మిథాలీ మరో మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు.

మూడో వికెట్‌కు 151 పరుగులు

మంధాన తనదైన శైలిలో విజృంభించి 54 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో మంధాన కెరీర్‌లో 14వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసింది. అనంతరం మిథాలీ రాజ్ కూడా 102 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌ సాయంతో కెరీర్‌లో 52వ హాఫ్ సెంచరీ సాధించింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 151 పరుగులు జోడించారు.

88 బంతులు మిగిలి ఉండగానే

దీంతో భారత్‌ 88 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 161 పరుగులకే కుప్పకూల్చారు. పేసర్ జులన్ గోస్వామి మూడు వికెట్లు తీయగా.. ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు.

Story first published: Tuesday, January 29, 2019, 13:45 [IST]
Other articles published on Jan 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X