న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ:సిరాజ్ గట్టెక్కించినా.. ఉప్పల్ వన్డేలో టీమిండియా చేసిన ఘోర తప్పిదాలు ఇవే!

Sloppy fielding, 17 wides- 3 mistakes India made during the first ODI against New Zealand at Hyderabad

హైదరాబాద్: పరుగుల మోత మోగుతూ.. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపుతూ సాగిన ఉప్పల్ పోరులో టీమిండియానే విజయం వరించింది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో ఓటమి నుంచి గట్టెక్కింది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్.. బౌలింగ్‌లో లోకల్ భాయ్ సిరాజ్ సంచలన ప్రదర్శన కనబర్చడంతో ఓడిపోయే మ్యాచ్‌లో భారత్ విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా..

టీమిండియా చేసిన తప్పిదాలు ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది భారత్ వేదికగానే జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం సన్నదమవుతున్న రోహిత్ సేన..ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉప్పల్ వన్డేలో టీమిండియా చేసిన మూడు తప్పిదాలు.. జట్టును దాదాపు ఓటమి ముంగిట నిలబెట్టాయి.

1. టెయిలెండర్లను ఔట్ చేయలేకపోవడం..

1. టెయిలెండర్లను ఔట్ చేయలేకపోవడం..

టీమిండియా‌ను డెత్ బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. టీ20 ఫార్మాట్‌లోనే కాదు వన్డేల్లోనూ ఇది రిపీట్ అవుతోంది. టాపార్డర్ బ్యాటర్లను త్వరగా పెవిలియన్ చేర్చుతున్న భారత బౌలర్లు.. టెయిలెండర్లను మాత్రం ఔట్ చేయలేకపోతున్నారు. ఉప్పల్ మ్యాచ్‌లోను 131 పరుగులకే 6 వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించిన భారత బౌలర్లు ఏడో వికెట్‌ తీయలేక 162 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని సమర్పించుకున్నారు. ఇలా చివరి నాలుగు వికెట్లకు 100 పరుగుల కన్నా ఎక్కువ భాగస్వామ్యాలు నమోదు చేసిన 8 సందర్భాల్లో నాలుగు టీమిండియానే సమర్ఫించుకోవడం గమనార్హం. ఇటీవల శ్రీలంకతో.. అంతకుముందు బంగ్లాదేశ్‌తో కూడా భారత బౌలర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించకపోతే మెగా టోర్నీలో టీమిండియాకు కష్టాలు తప్పవని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.

2. చెత్త ఫీల్డింగ్..

2. చెత్త ఫీల్డింగ్..

టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్ శ్రీధర్ తప్పుకున్న తర్వాత జట్టు ఫీల్డింగ్ దారుణంగా తయారైంది. ఆర్ శ్రీధర్ తర్వాత టీ దిలీప్ బాధ్యతలు చేపట్టగా ఫీల్డింగ్ ప్రమాణాలు పడిపోయాయి. దాంతో అతనిపై వేటు వేసిన బీసీసీఐ.. పంజాబ్ కోచ్ మునిష్ బాలికి అవకాశం ఇచ్చింది. అయినా ఎలాంటి మార్పు కనబడటం లేదు. సునాయస క్యాచ్‌లు నేలపాలు చేయడంతో పాటు బంతిని ఆపడంలోనే ఫీల్డర్లు తడబడుతున్నారు. చెత్త ఫీల్డింగ్ కారణంగా.. ప్రత్యర్థి జట్టు అదనంగా పరుగులు చేయడంతో పాటు బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. నిన్నటి మ్యాచ్‌లో షమీ, సుందర్ చేతులకు వచ్చిన బంతిని వదిలేయగా.. ఓ రనౌట్ మిస్సయ్యింది. శార్దూల్ ఓ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. టీమిండియా ఫీల్డింగ్ ఎంతో మెరుగవ్వాల్సి ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో గట్టెక్కినా.. మెగా టోర్నీల్లో విజయం సాధించాలంటే మెరుపు ఫీల్డింగ్ చేయాల్సిందే.

3. 19 ఎక్స్‌ట్రాల్లో 14 వైడ్లు..!

3. 19 ఎక్స్‌ట్రాల్లో 14 వైడ్లు..!

టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా... ఎక్స్‌ట్రా డెలివరీలతో జట్టుకు నష్టం చేస్తున్నారు. శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 5 నోబాల్స్ వేయగా.. జట్టు మొత్తం 7 నోబాల్స్ వేసి ఆ మ్యాచ్‌లో మూల్యం చెల్లించుకుంది. ఇక ఉప్పల్ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు మొత్తం 14 వైడ్స్ వేసారు. ఇందులో శార్దూల్ ఠాకూర్ ఒక్కడే ఏడు వైడ్స్ వేసాడు. సిరాజ్ నాలుగు వైడ్లు వేయగా.. హార్దిక్ పాండ్యా మూడు వైడ్లు వేసాడు. వైడ్ బాల్స్ ద్వారా వేసిన ఎక్స్‌ట్రా డెలివరీలను బ్రాస్‌వెల్ బౌండరీలకు తరలించి పరుగులు రాబట్టాడు. టీమిండియా క్రమశిక్షణగా బౌలింగ్ చేయడంపై సీరియస్‌గా ఫోకస్ పెట్టాలి. వైడ్స్, నోబాల్స్ వేయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

Story first published: Thursday, January 19, 2023, 10:34 [IST]
Other articles published on Jan 19, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X