న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్య‌ా, రాహుల్‌ స్థానాల్లో జట్టులోకి శుభ్‌మాన్‌, శంకర్‌!

Shubman Gill, Shankar to replace Rahul, Pandya

హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన భార‌త క్రికెట‌ర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌ స్థానాల్లో ఆల్‌రౌండ‌ర్‌ విజయ్ శంకర్‌, బ్యాట్స్‌మ‌న్ శుభ్‌మ‌న్ గిల్‌ను సీనియ‌ర్ సెల‌క్ష‌న్‌ క‌మిటీ ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాతో రెండో వన్డే మంగళవారం అడిలైడ్‌లో జరగనుంది.

ధోనితో ఓ బామ్మ: సోషల్ మీడియాలో వీడియో వైరల్ధోనితో ఓ బామ్మ: సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు వన్డేల్లో వీరిద్దరు జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ సీనియర్ అధికారి ఒక‌రు పేర్కొన్నారు. భారత్‌-ఎ తరపున విజయ్‌ శంకర్‌ న్యూజిలాండ్‌ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. ఇప్ప‌టికే టీ20ల్లో టీమిండియా త‌ర‌ఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

పాండ్య‌ా, రాహుల్‌ స్థానాల్లో శుభ్‌మాన్‌, శంకర్‌!

పాండ్య‌ా, రాహుల్‌ స్థానాల్లో శుభ్‌మాన్‌, శంకర్‌!

మరోవైపు న్యూజిలాండ్‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు దేశ‌వాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న‌యువ క్రికెట‌ర్ శుభ్‌మాన్‌ను ఎంపిక చేశారు. కాగా, పాండ్యా, రాహుల్‌లపై విచారణ త్వరగా ముగించాలని బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌ భావిస్తోండగా.. సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ అందుకు భిన్నంగా స్పందించారు.

రెండో వన్డే సమయానికి విచారణ పూర్తిచేయాలి

రెండో వన్డే సమయానికి విచారణ పూర్తిచేయాలి

"రెండో వన్డే సమయానికి విచారణ పూర్తిచేయాలి. ఒక ఆటగాడి ప్రవర్తన కారణంగా సిరీస్‌లో జట్టు బలాన్ని దెబ్బతీయడం సరికాదు" అని ఎడుల్జీకి పంపిన ఈ మెయిల్‌లో వినోద్ రాయ్‌ పేర్కొన్నాడు. డయానా ఎడుల్జీ మాత్రం విచారణ విషయంలో తొందరేం వద్దని, అలా చేయడం వల్ల వ్యవహారాన్ని కప్పిపుచ్చినట్లవుతుందని ఆమె అన్నారు. మరోవైపు, బీసీసీఐ సస్పెన్షన్ వేటు వేయడంతో ఆసీస్ పర్యటనలో ఉన్న వీరిద్దరూ భారత్‌కు తిరుగు పయనమైన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు సభ్యుల సంఖ్య 15 నుంచి 13కు తగ్గింది.

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్' షోకి ఇటీవల హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు.

తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి

తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి

మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ వివాదాస్పదంగా చెప్పుకొచ్చాడు. తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. ఈ షో ఇటీవల ప్రసారంకాగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పాండ్యా ట్విట్టర్‌లో క్షమాపణ కూడా చెప్పాడు. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు.

Story first published: Sunday, January 13, 2019, 10:44 [IST]
Other articles published on Jan 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X