న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు అవసరమా? పరిమిత ఓవర్ల పగ్గాలు రోహిత్‌కు ఇవ్వాలా?

Should selectors split captaincy between Virat Kohli, Rohit Sharma?

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవ్వడంతో మరోసారి ఇద్దరి కెప్టెన్ల అంశం తెరపైకి వచ్చింది. పరిమిత ఓవర్ల కెప్టెన్సీలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉండటంతో జట్టు సారథ్య బాధ్యతలను విభజించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది.

ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా..

ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా..

ఐపీఎల్‌లో ముంబై జట్టును సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న రోహిత్.. ఇప్పటికే నాలుగు టైటిళ్లు అందించాడు. మరోవైపు కోహ్లీ మాత్రం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ‌చాలెంజర్స్ బెంగళూరు ఇంత వరకు ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడు. 2016లో ఫైనల్‌కు చేర్చినప్పటికీ.. సన్‌రైజర్స్ చేతిలో నిరాశే ఎదురైంది. ఇక ప్రతీ ఐపీఎల్‌కు ముందు రోహిత్ ఫ్యాన్స్ ఈ డిమాండ్ తెరపైకి తెస్తూనే ఉంటారు. కోహ్లీ విశ్రాంతి తీసుకున్న సమయాల్లో కూడా రోహిత్ జట్టుకు విజయాలందించాడు. ఆసియాకప్, నిదహాస్ ట్రోఫీలను అందించాడు.

ఇది ఇక్కడ పనిచేయదు..

ఇది ఇక్కడ పనిచేయదు..

అయితే తాజాగా భారత మాజీ ఛీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ముందు టీమిండియాకు ఇద్దరి కెప్టెన్లు నియమిస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించగా.. ఈ కాన్సెప్ట్ భారత క్రికెట్‌లో పనిచేయదని అతను తెగేసి చెప్పాడు. దీంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.

అయినా కోహ్లీనే కెప్టెన్‌గా ఉండాలి..

అయినా కోహ్లీనే కెప్టెన్‌గా ఉండాలి..

ఇక కోహ్లీ చిన్నానాటి కోచ్ రాజ్‌కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించే సత్తా కోహ్లీకి ఉందన్నాడు. ఇద్దరి కెప్టెన్ల సంప్రదాయం భారత్‌ది కాదని స్పష్టం చేశాడు.

‘విరాట్ సామర్థ్యం ఉన్నంత వరకు మూడు ఫార్మాట్లలో భారత జట్టు విజయవంతంగా రాణిస్తున్నప్పుడు ఈ ఇద్దరి కెప్టెన్ల సంప్రదాయం భారత క్రికెట్‌కు అవసరం లేదు. కోహ్లీ అద్భుతంగా రాణించేంత కాలం జట్టులో కొనసాగాలని కోరుకుంటున్నా. రోహిత్ శర్మ కూడా అద్భుతమైన కెప్టెన్. అతని సూపర్ కెప్టెన్సీతో ఐపీఎల్‌లో ముంబైకి నాలుగు సార్లు టైటిల్ అందించాడు. కానీ విరాట్ అద్భుతంగా రాణించేంత కాలం అతనే కెప్టెన్‌గా కొనసాగాలి'అని రాజ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

విరాట్ కన్నా.. రోహితే

విరాట్ కన్నా.. రోహితే

మూడేళ్ల క్రితం ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం కోహ్లీనే మూడు ఫార్మాట్లలో జట్టును నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక పరిమిత ఓవర్ల కెప్టెన్సీలో కోహ్లీ కన్నా రోహిత్‌కే మంచి రికార్డు ఉంది. రోహిత్ సారథ్యంలో భారత్ 78.94 శాతంతో 19 మ్యాచ్‌ల్లో 15 గెలవగా.. కోహ్లీ కెప్టెన్సీలో 65.71 శాతంతో 37 మ్యాచ్‌ల్లో 22 మాత్రమే విజయం సాధించింది.

ఇక ఈ జాబితాలో మోస్ట్ సక్సెఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 59.28 శాతంతో 72 మ్యాచ్‌ల్లో 41 విజయాలు సాధించింది. ఇక 10 వన్డేల్లో రోహిత్ కెప్టెన్సీలో 8 గెలవగా.. కోహ్లీ సారథ్యంలో 89 మ్యాచ్‌ల్లో 62 గెలిచింది. అయితే తక్కువ మ్యాచ్‌ల్లో విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంటుందని కోహ్లీ ఫ్యాన్స్ వాదిస్తున్నారు.

Story first published: Thursday, March 19, 2020, 16:27 [IST]
Other articles published on Mar 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X