న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌-పాక్‌ మధ్య క్రికెట్‌ ఎంతో అవసరం.. ఇప్పుడు ఆడకపోవడం సిగ్గుచేటుగా ఉంది: మాలిక్

Shoaib Malik says World cricket badly needs India vs Pakistan rivalry to resume

కరాచీ: భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ పోటీ ప్రపంచానికి ఎంతో అవసరమని ఆ జట్టు సీనియర్ బ్యాట్స్‌మన్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త‌ షోయబ్‌ మాలిక్‌ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్‌కు యాషెస్‌ సిరీస్‌ ఎంత ముఖ్యమో.. భారత్‌-పాక్‌ జట్ల మధ్య క్రికెట్‌ కూడా అంతే ముఖ్యమన్నాడు. దాయాది దేశాలు మళ్లీ క్రికెట్‌ ఆడితే చూడాలనుందని మాలిక్ అన్నాడు.

దాయాది దేశాల మధ్య క్రికెట్‌ ఎంతో అవసరం:

దాయాది దేశాల మధ్య క్రికెట్‌ ఎంతో అవసరం:

షోయబ్‌ మాలిక్‌ తాజాగా ఓ పాక్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ... 'ప్రపంచ క్రికెట్‌కు యాషెస్‌ సిరీస్‌ ఎంత ముఖ్యమో భారత్‌-పాక్‌ జట్ల మధ్య క్రికెట్‌ కూడా అంతే ముఖ్యం. యాషెస్‌ సిరీస్‌ లేకుండా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు టెస్టు క్రికెట్‌ను ఊహించుకోగలవా?. వాళ్లెంత పట్టుదలగా ఆడతారో ఇక్కడ కూడా అలాగే ఆడతారు. రెండింటికీ ఎంతో చరిత్ర ఉంది. ఇప్పుడు మనం క్రికెట్ ఆడకపోవడం సిగ్గుచేటుగా ఉంది' అని పేర్కొన్నాడు.

 క్రికెట్‌ పోటీలు జరగాలి:

క్రికెట్‌ పోటీలు జరగాలి:

'భారత క్రికెటర్లపై అభిమానం, గౌరవంతో మాట్లాడే పాకిస్థాన్‌ మిత్రులు నాకున్నారు. పాకిస్థాన్‌ జట్టుతో కలిసి నేను భారత్‌లో పర్యటించినప్పుడు కూడా ఇలాంటి ఆతిథ్యమే నాకు లభించింది. వీలైనంత త్వరగా ఇరు దేశాల మధ్య క్రికెట్‌ పోటీలు తిరిగి ప్రారంభమవ్వాలని కోరుకుంటున్నా. అందుకోసం ఎదురుచూస్తున్నా; అని షోయబ్‌ మాలిక్‌ తెలిపాడు. మాలిక్ పాక్ తరఫున 35 టెస్టులు, 287 వన్డేలు, 113 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 12 శతకాలు, 60 అర్ధ శతకాలు నమోదు చేశాడు.

పొట్టి ప్రపంచకప్‌లో పాక్ విజేతగా నిలుస్తుంది:

పొట్టి ప్రపంచకప్‌లో పాక్ విజేతగా నిలుస్తుంది:

ఒకవేళ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఈ అక్టోబర్‌-నవంబర్‌లో‌ జరిగితే తమ జట్టు విజేతగా నిలుస్తుందని షోయబ్‌ మాలిక్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాలతో పాటు మునుపెన్నడూ లేనంత ఫిట్‌నెస్‌తో తమ ఆటగాళ్లు ఉన్నారన్నాడు. తాను కూడా ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నానని, తనకింకా క్రికెట్‌ ఆడాలని ఉందన్నాడు. తాను సాధించాల్సినవి మరిన్ని ఉన్నాయని చెప్పాడు. ఇక రిటైర్మెంట్‌ తర్వాత ఏదైనా మీడియాలో పనిచేయాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

 ఇంగ్లండ్‌ పర్యటనకు పాక్:

ఇంగ్లండ్‌ పర్యటనకు పాక్:

భార్య సానియా మీర్జా, కుమారుడు ఇజాన్‌ను చూసివచ్చేందుకు షోయాబ్‌ మాలిక్‌కు ఇటీవలే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అనుమతించింది. త్వరలో హైదరాబాద్‌ వచ్చేందుకు షోయాబ్‌ సన్నాహాలు పూర్తిచేసుకొన్నట్టు తెలుస్తున్నది. భార్య, కుమారుడితో కొన్ని రోజులు గడిపిన తర్వాత నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లి జట్టుతో చేరనున్నాడు. అమెరికా నుంచి హైదరాబాద్‌ చేరుకోగానే కేంద్ర ప్రభత్వం లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకోవడంత కుమారుడితో సానియా మీర్జా హైదరాబాద్‌లో ఉండిపోయారు. కాగా షోయాబ్‌ మాలిక్‌ పాకిస్తాన్‌లో ఉన్నాడు. పాకిస్తాన్ జట్టు ఈ నెల 28న ఇంగ్లండ్‌ మాంచెస్టర్ బయలుదేరుతుంది. ఈ పర్యటనలో పాక్‌ మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది.

టెస్టు క్రికెట్‌ అత్యుత్తమం.. ఈ ఫార్మాట్‌కు ఏదీ సాటిరాదు: గేల్‌

Story first published: Wednesday, June 24, 2020, 10:53 [IST]
Other articles published on Jun 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X