For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు క్రికెట్‌ అత్యుత్తమం.. ఈ ఫార్మాట్‌కు ఏదీ సాటిరాదు: గేల్‌

Chris Gayle says Test Cricket Is The Ultimate And Most Challenging

ఆంటిగ్వా: క్రికెట్‌లో టెస్టు క్రికెట్‌ను మించింది మ‌రొక‌టి లేద‌ని వెస్టిండీస్ విధ్వంస‌క ఓపెనర్, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ ‌గేల్ పేర్కొన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో బాగా ఆడితే.. ఇక ఎక్క‌డైనా తిరుగుండ‌ద‌ని గేల్ అన్నాడు. సంప్రదాయ ఫార్మాట్‌కు, జీవితానికి అవినాభావ సంబంధం ఉందని గేల్‌ అన్నాడు. విండీస్‌ తరఫున 103 టెస్టులాడిన యూనివ‌ర్స‌ల్ బాస్.. ఏడేళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు.

మంగ‌ళ‌వారం టీమిండియా టెస్ట్ ఓపెనర్ మ‌యాంక్ అగ‌ర్వాల్‌తో లైవ్ చాట్‌లో మాట్లాడిన క్రిస్ గేల్ త‌న అభిప్రాయాలు వెల్ల‌డించాడు. 'టెస్టు క్రికెట్‌ అన్నింటి కంటే ఉత్తమమైనది. ఐదు రోజుల ఆటలో చాలా సవాళ్లు ఎదురవుతాయి. క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో సుదీర్ఘ ఫార్మాట్‌తో నేర్చుకోవచ్చు. మన నైపుణ్యం, మానసిక బలం, అంకితభావం ఇవన్నీ టెస్టులతోనే వెలుగులోకి వస్తాయి' అని గేల్ అన్నాడు.

టెస్ట్ ఫార్మాట్‌ ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని, అది ఆటతో పాటు జీవితానికి తోడ్పడుతుందని క్రిస్ గేల్‌ చెప్పుకొచ్చాడు. 'అంకిత‌భావం, దృఢ సంక‌ల్పం, నైపుణ్యం బ‌య‌ట‌కు రావాలంటే టెస్టులు ఆడాల్సిందే. జీవితానికి సుదీర్ఘ ఫార్మాట్‌కు అవినాభావ సంబంధం ఉంది. టెస్టు క్రికెట్‌లో స‌వాళ్లు అధికం. అలాగే జీవితంలోనూ ఒడిదుడుకులు స‌హ‌జం. వాటిని ఎదుర్కోగ‌లిగే నైపుణ్యం సంప్ర‌దాయ ఫార్మాట్‌తో అల‌వ‌డుతుంది' అని పేర్కొన్నాడు. గేల్‌ 2014 త‌ర్వాత ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు.

అమెరికాలో నల్ల జాతీయుడు జార్డ్​ ఫ్లాయిడ్ మృతికి పోలీసు కారణవడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృమయిన విషయం తెలిసిందే. జాతి వివక్షపై క్రిస్ గేల్ ఇటీవల డారెన్​ సమీకి మద్దతు తెలిపాడు. 'సరైన విషయం కోసం పోరాడేందుకు సమయం మించిపోలేదు. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎదుర్కొన్న చేదు అనుభవాలపై పోరాడేందుకు మరీ ఆలస్యం కాలేదు. నీ కథ లాగే ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పినట్టే క్రికెట్​లోనూ వర్ణ వివక్ష ఉంది' అని గేల్ ట్వీట్ చేశాడు.

Story first published: Wednesday, June 24, 2020, 9:53 [IST]
Other articles published on Jun 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+