న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషభ్ పంత్ అందగాడు.. బరువు తగ్గితే కోట్లు సంపాదించగలడు: షోయబ్ అక్తర్

 Shoaib Akhtar says Hope Rishabh Pant takes care of his weight. He can be a model, earn in crores

కరాచీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పంత్ భయం ఎరుగని ఆటగాడని, కొత్త షాట్లతో ప్రత్యర్థి జట్లను ఇబ్బంది పెడుతాడని కొనియాడాడు. అయితే పంత్ ఫిట్‌నెస్‌పై కాస్త ఫోకస్ పెట్టాల్సి అవసరం ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. పంత్ గనుక బరువు తగ్గితే మోడల్‌గా మారి కోట్లు సంపాదించగలడని తెలిపాడు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై అజేయ శతకంతో చెలరేగిన రిషభ్ పంత్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా పంత్ గురించి మాట్లాడిన అక్తర్.. అతనో అందగాడని, బరువు తగ్గాలని సూచించాడు.

'రిషభ్‌ పంత్‌ దూకుడైన, ఎలాంటి భయం లేని ఆటగాడు. కట్‌ షాట్, పుల్‌ షాట్, రివర్స్‌ స్వీప్ మాత్రమే కాకుండా తనదైన శైలిలో కొత్త షాట్లను ఆడగలడు. ఒంటిచేత్తో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లపై భారత్‌ను గెలిపించాడు. అదేవిధంగా పంత్ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. దానిపై శ్రద్ధ చూపుతాడని భావిస్తున్నా. ఎందుకంటే భారత్ మార్కెట్‌ చాలా పెద్దది. పంత్ కానీ మంచి పర్సనాలిటీతో ఉండుంటే మోడల్‌ అయ్యే అవకాశం ఉంది. కోట్లు సంపాదించగలడు. ఎందుకంటే భారత్‌లో సూపర్‌స్టార్‌ అయితే వారిపై భారీగా పెట్టుబడి పెట్టేందుకు బడా కంపెనీలు సిద్ధంగా ఉంటాయి'అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు.

ఫిట్‌నెస్‌ కారణంగా జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా అద్భుతంగా రీ ఎంట్రీ ఇచ్చాడని అక్తర్ ప్రశంసించాడు. తనను తీర్చిదిద్దుకునే క్రమంలో ఫిట్‌నెస్‌తోపాటు మానసికంగా బలోపేతం కావడం భారత్ జట్టుకు ప్రయోజకరంగా మారిందని అభిప్రాయపడ్డాడు. 'హార్దిక్‌ను ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది. బౌలింగ్‌లోనూ మంచి ప్రదర్శన ఇవ్వడం ద్వారా టీమిండియాకు సమతూకం వస్తుంది. అలానే ఫిట్‌నెస్‌పై పాండ్యా సీరియస్‌గా దృష్టి పెట్టాడు. అన్‌ఫిట్‌గా ఉన్నప్పుడు దాదాపు రెండేళ్లపాటు హార్దిక్ జట్టుకు దూరమయ్యాడు. అది అతనికి మంచే చేసిందని చెప్పాలి'అని అక్తర్‌ పేర్కొన్నాడు.

హార్దిక్‌కు ఉన్న అరుదైన టాలెంట్‌ను మెరుగుపరుచుకోవాలని షోయబ్‌ సూచించాడు. 'హార్దిక్‌ను చూస్తే ఆన్‌ ఫీల్డ్‌లో ఆస్వాదిస్తున్నట్లుగా ఉంది. అయితే మైదానం వెలుపల ఎక్కువగా ఎంజాయ్‌ చేయొద్దని చెబుతా. అతడికి ఉన్న అరుదైన టాలెంట్‌ను ఇంకా మెరుగుపరుచుకోవాలి. గొప్ప బౌలర్‌, గొప్ప ఫీల్డర్‌ కాబట్టే భారత పేస్‌ దళానికి అదనపు బలంగా మారతాడు. అంతేకాకుండా ఇతర బౌలర్లను డామినేట్‌ కూడా చేశాడు. అందుకే ఆటపై మరింత దృష్టి పెట్టమని సూచిస్తా'' అని షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు.

Story first published: Thursday, July 21, 2022, 16:45 [IST]
Other articles published on Jul 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X