న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కేవలం టీవీ షోల్లో కూర్చోవడం నా పని కాదు.. క్రికెట్‌లో సేవలు అందించడానికి అవకాశం ఇవ్వండి'

Shoaib Akhtar cites example of Sourav Ganguly, says ‘my job was not to sit on TV shows’

కరాచీ: నా పని కేవలం టీవీ షోల్లో కూర్చోవడం కాదు, క్రికెట్‌లో సేవలు అందించడానికి నాకు అవకాశం ఇవ్వాలి అని పాకిస్థాన్‌ మజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌ అంటున్నాడు. పాకిస్థాన్‌లో క్రికెట్‌ అభివృద్ధి సరైన దిశగా సాగట్లేదన్నాడు. కీలక పదవుల్లో సరైన వ్యక్తులను జాతీయ క్రికెట్‌ అకాడమీ నియమించాలని అభిప్రాయపడ్డాడు. ఈ మధ్య కాలంలో అక్తర్‌ నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తన యూట్యూబ్‌ చానెల్‌, పలు చాట్‌షోలలో పాల్గొంటున్న అక్తర్‌ పలు విషయాలను పంచుకుంటున్నాడు.

IPL 2020: కరోనా ప్రభావం.. ఐపీఎల్‌కు ఆసీస్‌ ప్లేయర్లు దూరం?IPL 2020: కరోనా ప్రభావం.. ఐపీఎల్‌కు ఆసీస్‌ ప్లేయర్లు దూరం?

 కెప్టెన్‌ మాత్రం ఏం చేయగలడు?:

కెప్టెన్‌ మాత్రం ఏం చేయగలడు?:

తాజాగా షోయబ్‌ అక్తర్‌ మాట్లాడుతూ... 'పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఉన్నతాధికారులు కింది వారికి తమ మార్గనిర్దేశకాలను నిర్దేశించాలని భావిస్తున్నారు. అయితే వారికి తగ్గట్లుగా జాతీయ క్రికెట్‌ అకాడమీ ఛైర్మన్‌, సెక్షన్ ప్యానెల్, టీం కెప్టెన్‌ ఉండాలి. ఇక్కడ కెప్టెన్‌ ఏం చేయగలడు?. మైదానంలోకి వెళ్లడం, గెలవాలని ప్రార్థించడం తప్ప. ఉన్నతాధికారులు కింది స్థాయిలో అసమర్థులను నియమించి తమ వ్యవహారాలను యథేచ్చగా నిర్వహిస్తున్నారు' అని అన్నాడు.

 భారత్‌కు దాదా, ద్రవిడ్‌ ఉన్నారు:

భారత్‌కు దాదా, ద్రవిడ్‌ ఉన్నారు:

'భారత్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, జాతీయ క్రికెట్‌ అకాడమీ ఛైర్మన్‌గా రాహుల్‌ ద్రవిడ్ ఉన్నారు. దక్షిణాఫ్రికాలో క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడిగా గ్రేమ్‌ స్మిత్‌, హెడ్ కోచ్‌గా మార్క్‌ బౌచర్‌ ఉన్నారు. ఆస్ట్రేలియాకు రికీ పాంటింగ్ అండగా ఉన్నాడు. ఆయా దేశాల్లో మాజీలు క్రికెట్‌ అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నారు. కానీ.. పాక్‌లో అలా లేదు. ఇక్కడ మాజీ క్రికెటర్లను సమర్థంగా ఉపయోగించుకోవట్లేదు. నా పని కేవలం టీవీ షోల్లో కూర్చోవడం కాదు. క్రికెట్‌లో సేవలు అందించడానికి నాకు అవకాశం ఇవ్వాలి' అని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు.

అకాడమీల అభివృద్ధిపై దృష్టి సారించట్లేదు:

అకాడమీల అభివృద్ధిపై దృష్టి సారించట్లేదు:

'పాక్‌లో ఏజెన్సీ, అకాడమీల అభివృద్ధిపై దృష్టి సారించట్లేదు. దీని వల్ల క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే యువకుల సంఖ్య తగ్గిపోతుంది. బీసీసీఐ అకాడమీల అభివృద్ధిపై దృష్టి సారించింది. రాహుల్‌ ద్రవిడ్ భారత్‌లో యువకులను సరైన రీతిలో తీర్చిదిద్దుతున్నాడు. ఎందరో యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలానే పాక్‌లో ఉంటే ఎక్కువ మంది యువకులు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది' అని మజీ పేసర్ చెప్పుకొచ్చాడు.

భారత్‌ యుద్ధాన్ని కోరుకోదు:

భారత్‌ యుద్ధాన్ని కోరుకోదు:

'నేను దాదాపు భారత్ మొత్తం తిరిగాను. ఇండియా ఒక అద్భుతమైన దేశం. మ్యాచ్‌లు ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలను చాలా దగ్గరి నుంచి చూశాను. భారతీయులు చాలా మంచివాళ్లు. ఎల్లప్పుడూ పాకిస్థాన్‌ను స్వాగతిస్తూనే ఉంటారు. పాక్‌తో కలిసి పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. యుద్ధాన్ని అసలే కోరుకోరు. కానీ.. టీవీల్లో చూసినప్పుడు మాత్రం రెండు దేశాల మధ్య రేపే యుద్ధం జరుగుతుందన్నట్లు అనిపిస్తుంది. భారత్ పురోగతి పాకిస్థాన్‌తో ముడిపడి ఉందని నా నమ్మకం' అని అక్తర్‌ అన్నాడు.

Story first published: Wednesday, March 18, 2020, 9:46 [IST]
Other articles published on Mar 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X