న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధావన్ 'వాలెంటైన్స్‌ డే' స్సెషల్.. ఒక్కగానొక్క భార్యతో!!

Shikhar Dhawan Shares Valentines Day Photo With His One And Only

ఢిల్లీ: భుజ గాయం కారణంగా భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటనకు దూరమయిన విషయం తెలిసిందే. ఒకవైపు గాయం నుండి కోలుకుంటూ మరోవైపు ఈ ఖాళీ సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్నారు. అయితే శుక్రవారం 'వాలెంటైన్స్‌ డే' సందర్భంగా ధావన్‌ షేర్‌ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. భార్య ఆయేషాతో కలిసి దిగిన ఫొటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

వాలెంటైన్స్ డే స్పెషల్.. సచిన్ 'ఫస్ట్ ల‌వ్‌' ఏంటంటే (వీడియో)?వాలెంటైన్స్ డే స్పెషల్.. సచిన్ 'ఫస్ట్ ల‌వ్‌' ఏంటంటే (వీడియో)?

నా ఒక్కగానొక్క భార్య:

శిఖర్ ధావన్ తన భార్య ఆయేషాతో కలిసి దిగిన ఫొటోను శుక్రవారం ఇన్‌స్టాలో షేర్‌ చేసారు. పడక గదిలో ఇద్దరు కబుర్లు చెప్పుకునే ఫొటో అది. 'నా ఒక్కగానొక్క సతీమణి, స్నేహితురాలితో ప్రేమికుల దినోత్సవ వేడుకలు' అని క్యాప్షన్‌ రాసుకొచ్చారు. దీంతో భార్యపై తనకు ఎంత ప్రేమ ఉందో గబ్బర్ చెప్పకనే చెప్పారు. అందమైన జంటకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా ధావన్‌కు వాలెంటైన్స్‌ డే శుభాకాంక్షలు తెలిపింది.

రేపంటూ లేనట్టుగా:

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గబ్బర్ సహచరుడు 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ కూడా అభిమానులకు వాలెంటైన్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. రోహిత్ కూడా తన భార్య రితికాతో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేసారు. 'రేపంటూ లేనట్టుగా మీ ఇష్టమైన వారికి ప్రేమను పంచండి' అని క్యాప్షన్‌ రాసుకొచ్చారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదవ టీ20లో రోహిత్‌ శర్మకు తొడ కండారాలు పట్టేయడంతో వన్డే, టెస్ట్ సిరీస్‌లకు దూరమయ్యారు. టీ20, వన్డే సిరీస్‌లు ముగియగా.. న్యూజిలాండ్‌-భారత్‌ తొలిటెస్టు ఫిబ్రవరి 21న మొదలు కానుంది.

మై ఫస్ట్ ల‌వ్‌:

మై ఫస్ట్ ల‌వ్‌:

ప్రేమికుల రోజు సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తన 'ఫస్ట్ ల‌వ్‌'ను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను పోస్ట్ చేసారు.

శుక్రవారం సచిన్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వీడియోకి 'మై ఫస్ట్ ల‌వ్‌' అనే కాప్షన్ ఇచ్చారు. త‌న ఫ‌స్ట్ ల‌వ్ క్రికెట్ అన్న విష‌యాన్ని సచిన్ చెప్పకనే చెప్పారు. ఇప్పటికీ సచిన్ క్రికెట్ ఆటను ఎంతగా ఇష్టపడుతున్నాడో వీడియో ద్వారా చెప్పారు. ఇటీవ‌ల ఆస్ట్రేలియా వెళ్లిన సచిన్.. అక్క‌డ మళ్లీ బ్యాట్ ప‌ట్టారు. ఆ సమయంలో తీసిన వీడియోను షేర్ చేశారు.

ఇది నాలుగో గాయం:

ఇది నాలుగో గాయం:

చేతి వేలి గాయం కారణంగా వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ రాజ్‌కోట్ వన్డేలో గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి అతడు గాయపడడం ఇది నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు.

Story first published: Saturday, February 15, 2020, 10:26 [IST]
Other articles published on Feb 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X