న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నో డౌట్.. ఐపీఎల్ జరుగుతుంది: ధావన్

Shikhar Dhawan explains why IPL 2020 tournament is essential

ముంబై: కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ఖచ్చితంగా జరుగుతుందని భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్‌ను తొలుత ఏప్రిల్ 15 ఆ తర్వాత నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

అయితే దేశంలో విధించిన లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో క్యాష్ రిచ్ లీగ్ నిర్వహణపై బీసీసీఐ సమాలోచనలు చేసింది. కానీ ఐపీఎల్ నిర్వహణపై తుది నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మ్యాచ్‌లు నిర్వహించే సమస్యే లేదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేయడంతో మళ్లీ గందరగోళం నెలకొంది. మరోవైపు రాబోయే రోజులు వర్ష కాలం.. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ ఉండటంతో ఈ మెగాటోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి.

అయితే టీ20 ప్రపంచకప్ వాయిదే వేసే యోచనలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆ సెప్టెంబర్- అక్టోబర్ వీండోలో ఐపీఎల్ నిర్వహిద్దామని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుంది. అయితే అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయనేదానిపైనే ఈ టోర్నీ నిర్వహణ ఆధారపడి ఉంది. మెజార్టీ ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కన్నా ఐపీఎల్ నిర్వహించాలని, క్యాష్ రిచ్ లీగ్ సన్నహకంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

తాజాగా శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ నిర్వహించిన శిఖర్ ధావన్ ఐపీఎల్ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ఐపీఎల్ జరుగుతుందనే ఆశిస్తున్నా. నేనెప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తా. టోర్నీ జరిగితే చాలా మంచిది. ప్రతీ ఒక్కరు భద్రంగా ఉండటం కూడా చాల అవసరం. ఒకవేళ ఐపీఎల్ జరిగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా అది ఒక పాజిటివినీ వ్యాప్తి చేస్తుంది. క్రీడా టోర్నీలు తిరిగి ప్రారంభమవ్వడం చాలా మంచిది. వాటితో వాతవారణం, ప్రజల మూడ్ మారుతుంది. ఐపీఎల్ జరిగితే మాత్రం దాని ప్రభావం చాలా ఉంటుంది.'అని ధావన్ చెప్పుకొచ్చాడు.

ఐపిఎల్‌లోని ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ధావన్ ఈ సారి బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఈ సారి ప్రేక్షకులు లేకుండా ఐపిఎల్ ఆడటం అవసరం అని అలా తిరిగి ప్రారంభించగలిగితే, తాము ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు.

డ్రగ్స్ కేసులో శ్రీలంక క్రికెటర్ అరెస్ట్!డ్రగ్స్ కేసులో శ్రీలంక క్రికెటర్ అరెస్ట్!

Story first published: Monday, May 25, 2020, 19:46 [IST]
Other articles published on May 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X