న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ వల్లే బ్రేస్‌వెల్ వికెట్ దక్కింది: శార్దూల్ ఠాకూర్

Shardul Thakur Reveals How Virat Kohli’s Advise Helped Him Dismiss Michael Bracewell in Hyderabad ODI

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచనలతోనే ఆఖరి ఓవర్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌ను ఔట్ చేశానని లార్డ్ శార్దూల్ ఠాకూర్ తెలిపాడు. ఈ వికెట్‌తో బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 12 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన శార్దూల్ ఠాకూర్.. విరాట్ కోహ్లీ యార్కర్ వేయమని తనకు సూచించాడని తెలిపాడు. ఈ బాల్‌కు బ్రేస్‌వేల్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ వికెట్ గనుక శార్దూల్ తీయకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

ఈజీగా గెలుస్తుందనుకుంటే..

శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేయడంతో 349 పరుగులు చేసిన టీమిండియా తేలిగ్గా గెలుస్తుందని భావించారంతా. అందుకు తగ్గట్టుగానే భారత బౌలర్లు రాణించారు. 131 పరుగులకే 6 వికెట్లు పడగొట్టారు. ఈ దశలో మైకెల్ బ్రాస్‌వెల్ (78 బంతుల్లో 140), మిచెల్ సాంట్నర్ (45 బంతుల్లో 57) ఏడో వికెట్‌కు 162 పరుగులు జోడించారు. దాంతో న్యూజిలాండ్ విజయం దిశగా నడిచింది. చివరి 12 బంతుల్లో ఆ జట్టు విజయానికి 24 బంతులు అవసరం కాగా.. హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీయడంతో పాటు 4 పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి 20 పరుగులు అవసరమవ్వగా.. శార్దూల్ ఠాకూర్ చేతికి రోహిత్ శర్మ బంతినిచ్చాడు.

సూపర్ యార్కర్‌తో..

సూపర్ యార్కర్‌తో..

అప్పటికే శార్దూల్ బౌలింగ్‌ను బ్రేస్‌వెల్ చితక్కొట్టాడు. దాంతో భారత శిభిరంలో ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇక శార్దూల్ సైతం తొలి బంతికే సిక్స్ ఇవ్వడం.. రెండో బంతిని వైడ్‌గా వేయడంతో అంతా ఆశలు వదులుకున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ సూపర్ యార్కర్‌తో బ్రేస్‌వెల్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూకు వెళ్లినా న్యూజిలాండ్‌కు ఫలితం దక్కలేదు. భారీ షాట్ ఆడాలనే ఉద్దేశం ముందుకు జరిగిన బ్రేస్‌వెల్ మూల్యం చెల్లించుకున్నాడు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న తనకు యార్కర్ లెంగ్త్ వేయాలని కోహ్లీ సూచించాడని మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌‌కు శార్దూల్ ఠాకూర్ తెలిపాడు. ఈ వికెట్‌తో విజయాన్నందించిన శార్దూల్‌ను లార్డ్ అంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్, మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

2019 ఐపీఎల్ ఫైనల్లోనూ..

బ్రేస్‌వెల్ ఔటైన విధానం తమకు 2019 ఐపీఎల్ ఫైనల్‌ను గుర్తు తెచ్చిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముంబై, చెన్నై జట్ల మధ్య ఆ సీజన్ ఫైనల్ జరిగింది. ముందు బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 రన్స్ చేసింది. దీంతో ముంబై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

అప్పుడు శార్దూల్ ఔటయ్యాడు..

అప్పుడు శార్దూల్ ఔటయ్యాడు..

ఈ మ్యాచ్ చివరి ఓవర్లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. జడేజా, వాట్సన్ క్రీజ్‌లో ఉన్నారు. బౌలింగ్‌కు దిగిన లసిత్ మలింగ.. మూడు బంతుల్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాలుగో బంతికి రెండో పరుగు తీయబోయిన వాట్సన్ రనౌటయ్యాడు. దీంతో చివరి రెండు బంతుల్లో చెన్నై విజయానికి 4 పరుగులు అవసరమయ్యాయి. వాట్సన్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్దుల్ ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి చెన్నై విజయానికి 2 పరుగుల దూరంలో ఉండగా.. మలింగ శార్దుల్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. అప్పుడు కూడా ఇలానే రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ అనుభవాన్ని శార్దూల్ తాజా మ్యాచ్‌లో ఉపయోగించాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Thursday, January 19, 2023, 13:58 [IST]
Other articles published on Jan 19, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X