న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క ఓవర్‌తో ఓడించావ్.. నువ్వు నిజంగా దేవుడువయ్యా శార్దూల్ ఠాకూర్! పేలుతున్న సెటైర్లు, మీమ్స్!

Shardul Thakur brutally trolled after leaking 25 runs in 1 over in 1st ODI against New Zealand

హైదరాబాద్: టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలతో ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

పేలవ బౌలింగ్ కారణంగా 307 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ దారుణంగా విఫలమయ్యాడు. అతని వైఫల్యం టీమిండియా ఓటమిని శాసించింది. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవర్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్ ఐదు బౌండరీలతో 25 పరుగులు పిండుకున్నాడు.

ఊరించే షాట్ బాల్స్‌తో..

ఊరించే షాట్ బాల్స్‌తో..

39వ ఓవర్ వరకు భారత విజయవకాశాలు సజీవంగా ఉండగా.. 40వ ఓవర్‌లో టామ్ లాథమ్ శార్దూల్ చెత్త బౌలింగ్‌తో రెచ్చిపోయాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని టామ్ లాథమ్ డీప్ బ్యాక్‌‌వార్డ్ దిశగా సిక్సర్ బాదాడు. రెండో బంతిని శార్దూల్ వైడ్ వేయగా.. ఎక్స్‌ట్రా బాల్‌ను ఠాకూర్ బౌండరీ తరలించాడు. ఆ తర్వాత మరో మూడు బంతులను బౌండరీలుగా మలిచాడు. తీవ్ర ఒత్తిడికి గురైన ఠాకూర్ చివరి బంతిని మరో వైడ్ వేయగా.. మరో ఎక్స్‌ట్రా డెలివరీకి సింగిల్ తీసిన లాథమ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పదే పదే షాట్ బాల్స్ వేసిన శార్దూల్ .. ఒత్తిడిలో ఘోర తప్పిదాలు చేశాడు. దాంతో శార్దూల్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేవుడువయ్యా శార్దూల్..

కీలక సమయంలో వికెట్లు తీస్తూ లార్డ్ శార్దూల్ బిరుదు అందుకున్న అతను ఈ ఒక్క ఓవర్‌తో అభిమానుకుల రాక్షసుడిగా మారిపోయాడు. ఈ ఓవర్‌లో శార్దూల్ ఒక బంతిని గంటలకు 112 కిలోమీటర్ల వేగంతో బౌన్సర్‌గా వేసాడు. పైగా లెగ్ సైడ్ ఒక్క ఫీల్డర్‌‌ను పెట్టుకొని ఈ బాల్ వేయగా లాథమ్ ఈజీగా బౌండరీ రాబట్టాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. శార్దూల్ ఒక్కడే ఈ తరహా బాల్స్ వేయగలడని ఎగతాళి చేస్తున్నారు.

ధోనీ లేకపోవడంతో..

ధోనీ లేకపోవడంతో..

సీఎస్‌కే జట్టును వీడినప్పటి నుంచి శార్దూల్‌కు దరిద్రం పట్టుకుందని, అతను మునపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ధోనీ సలహాలతో చెలరేగిన శార్దూల్.. అతను లేకపోవడంతో ఎఫెక్టివ్‌గా కనపించడం లేదని పేర్కొన్నాడు. 70 బంతులకు 77 పరుగులు చేసిన లాథమ్.. శార్దూల్ పుణ్యమా 76 బంతుల్లోనే సెంచరీ సాధించాడని ట్రోల్ చేస్తున్నారు. శార్దూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవర్ చూసి కెప్టెన్ శిఖర్ ధావన్‌కు పిచ్చెక్కిందని, పరుగెత్తించి కొట్టేందుకు సిద్దమయ్యాడనే మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

చెలరేగిన టామ్ లాథమ్..

చెలరేగిన టామ్ లాథమ్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), శిఖర్ ధావన్(77 బంతుల్లో 13 ఫోర్లతో 72), శుభ్‌మన్ గిల్(65 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా... చివర్లో వాషింగ్టన్ సుందర్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ, లూకీ ఫెర్గూసన్ మూడేసి వికెట్లు తీయగా.. ఆడమ్ మిల్నే ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసి గెలుపొందింది. టామ్ లాథమ్(104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌ర్లతో 145 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(98 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 94 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Story first published: Friday, November 25, 2022, 18:05 [IST]
Other articles published on Nov 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X