న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాంటింగ్‌ను ఐపీఎల్‌ నుంచి త‌ప్పించాలి: వార్తలను ఖండించిన షేన్ వార్న్

Shane Warne did not call for Ricky Ponting to be banned from IPL 2019. Heres the truth

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్‌ను తప్పించాలంటూ తాను బీసీసీఐని కోరినట్లు వస్తున్న వార్తలను మాజీ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ఖండించాడు. అసలు ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని షేన్ వార్న్ స్పష్టం చేశాడు.

మూడు నెలల తర్వాత!: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పృథ్వీ షామూడు నెలల తర్వాత!: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పృథ్వీ షా

ఈ మేరకు ట్విట్టర్‌లో షేన్ వార్న్ స్పందిస్తూ "ఐపీఎల్ నుంచి పాంటింగ్‌ను బ్యాన్ చేయాలని నేను వ్యాఖ్యానించినట్లు వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమైనవి. వాటిలో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఇటువంటి చెత్త న్యూస్‌ను ఆపండి. ఆస్ట్రేలియా టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైనందున పాంటింగ్‌ను ఢిల్లీ కోచ్‌గా తీసేయమని నేను కోరితే అది కచ్చితంగా అది ఒక అవివేకమైన చర్య. ఒకవేళ బీసీసీఐ అలాంటి చర్యలు తీసుకుంటే. పాంటింగ్ అంగీకరించాల్సి ఉంటుంది" అని ట్వీట్ చేశాడు.

ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు వెళ్లే ఆస్ట్రేలియా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా రికీ పాంటింగ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా నియమించిన సంగతి తెలిసిందే. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అంశాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకుని పాంటింగ్‌ను తప్పుకోవాలని బీసీసీఐ ఆదేశిస్తే దానికి అతడు సిద్ధంగా ఉండాలని వార్న్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, February 15, 2019, 15:49 [IST]
Other articles published on Feb 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X