న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌కు షాక్.. ఏడాది పాటు నిషేధం!!

Shane Warne banned from driving for 12 months after multiple speeding offences


లండన్‌:
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌కు ఊహించని షాక్ తగిలింది. అతడిపై ఏడాది పాటు నిషేధం అమలు అయింది. అదేంటి షేన్‌ వార్న్‌ ఎప్పుడో క్రికెట్ నుండి తప్పుకున్నాడు కదా?.. ఇప్పుడు నిషేధం ఏంటి అనుకుంటున్నారా?. ప్రస్తుత నిషేధం.. వార్న్‌ ఏడాది పాటు డ్రైవింగ్‌ చేయకుండా లండన్ న్యాయస్థానం నిషేధించింది.

చేతిలో 5 వికెట్లు.. విజయానికి 11 ఓవర్లలో 5 పరుగులు.. అయినా ఒక్క పరుగు తేడాతో ఓటమి (వీడియో)చేతిలో 5 వికెట్లు.. విజయానికి 11 ఓవర్లలో 5 పరుగులు.. అయినా ఒక్క పరుగు తేడాతో ఓటమి (వీడియో)

మితిమీరిన వేగం:

మితిమీరిన వేగం:

రెండేండ్లలో ఆరుసార్లు మితిమీరిన వేగంతో కారు నడిపిన కారణంగా షేన్ వార్న్ ఏడాది కాలం డ్రైవింగ్ నిషేధానికి గురయ్యాడు. ఇంగ్లండ్‌లోని వెస్ట్ లండన్‌లో ఉంటున్న వార్న్.. గంటకు 40 మైళ్ల వేగంతో వెళ్లాల్సిన జోన్‌లో 47 మైళ్లతో తన కారులో ప్రయాణించాడు. గతేడాది లండన్‌లో 64 కి.మీ/గ వేగాన్ని వార్న్‌ అతిక్రమించాడు. వార్న్ ఇప్పటికే ఆరు సార్లు ఇలాంటి తప్పిదానికి పాల్పడ్డాడని స్పష్టం చేసిన కోర్టు అతడిపై చర్యలు తీసుకుంది.

ఏడాది పాటు నిషేధం:

ఏడాది పాటు నిషేధం:

నిబంధనలను ఉల్లఘించి అతివేగంగా కారును నడిపినందుకు ఏడాది పాటు డ్రైవింగ్ నిషేధంతో పాటు 1,845 పౌండ్ల (దాదాపు రూ.లక్షా 62వేలు)ను చెల్లించాలని లండన్ న్యాయస్థానం వార్న్‌ను ఆదేశించింది. అంతేకాకుండా అతడు లైసెన్స్‌ ఖాతాలో 15 పెనాల్టీ పాయింట్లు ఉన్నాయి. ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని శిక్షను విధించామని న్యాయమూర్తి టర్నర్‌ తెలిపారు. 'ప్రజల రక్షణ దృష్టిలో ఉంచుకుని వార్న్‌కు శిక్షను విధించాం. ఏప్రిల్‌ 2016 నుంచి గత ఏడాదిలోపు వార్న్‌ ఆరు సార్లు నిబంధనలు ఉల్లఘించాడు. వార్న్‌ లైసెన్స్‌ ఖాతాలో 15 పెనాల్టీ పాయింట్లు ఉండటంతో ఏడాది పాటు నిషేధం విధించాం' అని పేర్కొన్నారు.

వార్న్ రాసలీలలు:

వార్న్ రాసలీలలు:

తాజాగా వార్న్ రాసలీలలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. లవర్స్ అంటూ ఇద్దరు సెక్స్ వర్కర్లను ఇంటికి పిలిపించుకుని వార్న్ అడ్డంగా దొరికిపోయాడు. తన ప్రేమికురాలిని కూడా వెంటబెట్టుకుని రాసలీలలు కొనసాగించాడు. అంతేగాకుండా ఓపెన్‌గా తలుపులు తెరుచుకుని మరీ నానా హంగామా చేసి ఇరుగుపొరుగుకు ఇబ్బంది కలిగించాడు. అనంతరం ముగ్గురు యువతులు వార్న్‌ కారులో వెళ్లిపోయారు. మరునాడు ఉదయం చెప్పులు లేకుండానే వార్న్‌ కారులో ఇంటినుంచి బయటకు వెళ్లడం కనిపించింది. దీంతో వార్న్ తీరుపై పొరిగింటి వ్యక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌:

అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌:

ఆస్ట్రేలియా తరఫున షేన్‌ వార్న్‌ 145 టెస్టులు, 194 వన్డేలు ఆడాడు. టెస్టులో 708 వికెట్లు, వన్డేల్లో 293 వికెట్లు తీసాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు ఉన్నాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ 800 వికెట్లతో ఉన్నాడు.

Story first published: Tuesday, September 24, 2019, 10:24 [IST]
Other articles published on Sep 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X