న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షకీబ్ భార్య భావోద్వేగ పోస్ట్: కొత్త ప్రయాణానికి ఇది ఆరంభం.. గతంలో కంటే బలంగా తిరిగి వస్తాడు!!

Shakib Al Hasan's Wife Posts An Emotional Message On Social Media || Oneindia Telugu
Shakib Al Hasan to comeback stronger than ever in no time says Wife Umme Ahmed Shishir


ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్‌ హసన్‌పై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించడంపై అతని భార్య ఉమ్మె అహ్మద్ షిషిర్ స్పందించారు. షిషిర్ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేసి చాలా భావోద్వేగం అయ్యారు. షకీబుల్‌ కొత్త ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమే, గతంలో కంటే బలంగా తిరిగి వస్తాడు అని షిషిర్ ధీమా వ్యక్తం చేసారు. షకీబుల్‌పై ఐసీసీ మంగళవారం వేటు వేసిన విషయం తెలిసిందే. షకీబుల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్ల నిషేధం విధించింది. ఒక ఏడాది పూర్తిగా నిషేధం, మరో ఏడాది సస్పెన్షన్‌ కొనసాగుతుందని ఐసీసీ వెల్లడించింది.

'భారత్-బంగ్లాలకు పింక్‌ బాల్‌ టెస్ట్‌లు ఆడిన అనుభవం లేదు.. ఇది మాకు కలిసొచ్చేదే'!!'భారత్-బంగ్లాలకు పింక్‌ బాల్‌ టెస్ట్‌లు ఆడిన అనుభవం లేదు.. ఇది మాకు కలిసొచ్చేదే'!!

రాత్రికి రాత్రి గొప్పవారు కాలేరు:

రాత్రికి రాత్రి గొప్పవారు కాలేరు:

ఐసీసీ నిషేధం విధించడంపై షకీబుల్‌ భార్య భావోద్వేగంతో ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. 'లెజెండ్స్‌ రాత్రికి రాత్రి గొప్పవారు కాలేరు. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు, కష్టనష్టాలను ఎదుర్కొన్న వారే ఆ స్థాయికి చేరుకోగరు. లెజెండ్స్‌కు కూడా కష్ట కాలం వస్తుంది. కానీ.. దృఢ సంకల్పం, మనో ధైర్యంతో వారు ఆ పరిస్థితులను దాటుకుంటారు. షకీబుల్‌ మానసిక స్థైర్యం ఏంటో తనకు బాగా తెలుసు' అని షిషిర్ పోస్ట్ చేశారు.

గతంలో కంటే బలంగా తిరిగి వస్తాడు:

గతంలో కంటే బలంగా తిరిగి వస్తాడు:

షకీబుల్‌ కొత్త ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమే. గతంలో ఎన్నడూ లేనంత బలంగా తిరిగి వస్తాడు. గాయాల కారణంగా కొన్నాళ్లు క్రికెట్‌కు దూరమైనా.. తిరిగి ప్రపంచకప్‌లో ఎలాంటి ప్రదర్శన చేసాడో మనం అందరం చూసాం. ఇది కేవలం ఓ సంధి దశ మాత్రమే. షకీబుల్‌పై చూపుతున్న అభిమానానికి అందరికి ధన్యవాదాలు' అని షిషిర్ రాసుకొచ్చారు. షిషిర్-షకీబ్‌లు 2012 డిసెంబర్ 12న వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె అలైనా ఉంది.

రెండేళ్ల నిషేధం సరిపోదు:

రెండేళ్ల నిషేధం సరిపోదు:

షకీబుల్‌కు కొందరు మద్దతు ఇవ్వగా.. మరికొందరు మండిపడుతున్నారు. 'షకీబుల్‌పై ఎలాంటి సానుభూతి అవసరం లేదు. అతడు తప్పు చేశాడు. శిక్ష అనుభవించాడు. ఈ ఘటన యువ క్రికెటర్లకు ఓ పాఠం. నిబంధనలు పాటించకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో అందరికి అర్ధం అయింది. షకీబుల్‌పై విధించిన రెండేళ్ల నిషేధం సరిపోదు, ఇంకా ఎక్కువ కాలం విధించాల్సింది' అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ తన ట్విటర్‌లో రాసుకొచ్చారు.

మూడు అభియోగాలు:

మూడు అభియోగాలు:

2018 జనవరిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకీబుల్‌ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు నమోదయ్యాయి. ఇక 2018 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా బుకీలు సంప్రదించారు. ఆ విషయాన్ని కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం జరిపిన విచారణలో షకీబుల్‌ తన తప్పులను ఒప్పుకున్నాడు. తప్పు అంగీకరించడంతో ఐసీసీ శిక్ష విధించింది.

Story first published: Wednesday, October 30, 2019, 13:13 [IST]
Other articles published on Oct 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X