న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌పై బంగ్లా విజయం

Shakib Al Hasan helps Bangladesh level T20 series against West Indies

హైదరాబాద్: షకిబుల్‌ హసన్‌ 42; 5/20) ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయడంతో వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షకిబ్‌తో పాటు లిటన్‌దాస్‌ (60), మహ్మదుల్లా (43 నాటౌట్‌) మెరిశారు. పావెల్‌ (50) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. షకీబుల్ హసన్ (26 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్, 5/20,) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో.. గురువారం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ 36 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగుల భారీ స్కోరు చేసింది. స్వదేశంలో పొట్టి ఫార్మాట్‌లో బంగ్లాకు ఇదే అత్యధిక స్కోరు. లిట్టన్ దాస్ (34 బంతుల్లో 60; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సౌమ్య సర్కార్ (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), మహ్మదుల్లా (21 బంతుల్లో 43 నాటౌట్; 7 ఫోర్లు) దుమ్మురేపారు.

షకీబ్, మహ్మదుల్లా ఐదో వికెట్‌కు కేవలం 7 ఓవర్లలో 89 పరుగులు జోడించి భారీ స్కోరు అందించారు. యాంకర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన లిట్టన్.. తమీత్‌తో తొలి వికెట్‌కు 42, సౌమ్యతో రెండో వికెట్‌కు 68 పరుగులు జత చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. రొవ్‌మెన్ పావెల్ (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. హోప్ (36), కీమో పాల్ (29) మెరుగ్గా ఆడారు. స్పిన్ మ్యాజిక్ చూపిన షకీబ్ ఐదు వికెట్లతో విండీస్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చాడు.

టీ20ల్లో షకీబ్‌కు ఇది తొలి ఐదు వికెట్ల ఘనత. దీంతో బంగ్లా తరఫున ఈ ఫీట్‌ను అందుకున్న మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. హెట్మెయర్ (19), పూరన్ (14) నిరాశపర్చారు. షకీబ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 శనివారం ఇదే వేదికపై జరుగుతుంది.

Story first published: Friday, December 21, 2018, 9:15 [IST]
Other articles published on Dec 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X