న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shakib Al Hasan IPL XI: రోహిత్‌కు షాక్.. గేల్‌, ఏబీలకు దక్కని చోటు! షకీబ్‌ ఆల్‌టైమ్‌ ఐపీఎల్ ఎలెవెన్‌ టీమ్ ఇదే!

Shakib Al Hasan All Time IPL Playing 11: Chris Gayle And AB De Villiers Out, MS Dhoni As Captain

హైదరాబాద్: గతకొంత కాలంగా క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఈ మధ్య కాలంలో క్రికెట్ ఆడుతున్న వాళ్లు కూడా డ్రీమ్ జట్టును ఎంచుకుంటున్నారు.

ఈ క్రమంలో ఐపీఎల్ 2021 రెండో దశ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ తన ఆల్‌టైమ్ ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో షకీబ్‌ తన టీమ్‌ని ప్రకటించాడు. అయితే స్టార్ ఆటగాళ్లను మాత్రం షకీబ్‌ తన జట్టులో చోటివ్వలేదు.

రోహిత్‌కు షాక్

రోహిత్‌కు షాక్

ఐపీఎల్ 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతున్న బంగ్లాదేశ్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ తాజాగా యూఏఈ చేరుకున్నాడు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న షకీబ్‌.. మంగళవారం తన ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌ జాబితాను ప్రకటించాడు. మొత్తం 11 మందితో కూడిన జాబితాలో విండీస్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌, మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. షకీబ్‌ తన టీమ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్‌ ధోనీని కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. దాంతో ఐపీఎల్ టోర్నీలో అత్యధిక టోర్నీలు అందుకున్న రోహిత్ శర్మకు షాక్ తగిలింది. ఐపీఎల్‌లో మహీ మూడు ట్రోఫీలు అందుకోగా.. రోహిత్ ఐదు టైటిల్స్ ముద్దాడాడు.

స్పెషలిస్ట్‌ స్పిన్నర్ లేకుండానే

స్పెషలిస్ట్‌ స్పిన్నర్ లేకుండానే

షకీబ్‌ అల్‌ హసన్‌ తన జట్టుకు రోహిత్‌ శర్మ (ముంబై ఇండియన్స్‌), డేవిడ్‌ వార్నర్‌ (సన్‌రైజర్స్ హైదరాబాద్)లను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), నాలుగో స్థానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా (చెన్నై సూపర్ కింగ్స్)లకు అవకాశం ఇచ్చాడు. వికెట్‌ కీపర్‌గా ఎంఎస్ ధోనీతో పాటు కేఎల్‌ రాహుల్‌ (కింగ్స్‌ పంజాబ్‌)ను షకీబ్ ఎంచుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్లుగా బెన్‌ స్టోక్స్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌), రవీంద్ర జడేజా( సీఎస్‌కే)లను అవకాశం ఇచ్చాడు. పేస్ విబాగంల్లో లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్‌ గతంలో), జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్‌), భువనేశ్వర్‌ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)లను ఫాస్ట్‌ బౌలర్లుగా ఎంపిక చేసుకున్నాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్ లేకుండానే షకీబ్‌ జట్టును ఎంచుకున్నాడు.

IND vs ENG 5th Test: నిబంధనలు అతిక్రమించిన రవిశాస్త్రిపై చర్యలు ఉంటాయా?.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?

వ్యక్తిగతంగా ఒక్కో మైలురాయి

వ్యక్తిగతంగా ఒక్కో మైలురాయి

షకీబ్‌ అల్‌ హసన్‌ ప్రకటించిన జాబితాలో ఎక్కువ మంది ఆటగాళ్లు వ్యక్తిగతంగా ఒక్కో మైలురాయిని అందుకోవడం విశేషం. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నిలిస్తే.. విదేశీ ఆటగాళ్ల జాబితాలో సక్సెస్‌ రేట్‌ ఎక్కువగా ఉన్నది డేవిడ్ వార్నర్‌కే. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఇక కెప్టెన్‌గా ఎంపికయిన ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లోనే సీఎస్‌కే మూడు సార్లు ట్రోఫీ అందించిన ఆటగాడిగా నిలిచాడు. లసిత్ మలింగ ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉన్నాడు. సురేష్ రైనా గత సీజన్ ముందు (2020 ఆడలేదు) వరకు ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేశాడు.

షకీబ్‌ ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌ జాబితా

షకీబ్‌ ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ ఎలెవెన్‌ జాబితా

రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌, విరాట్‌ కోహ్లీ, సురేష్ రైనా, ఎంఎస్‌ ధోనీ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్‌, బెన్‌ స్టోక్స్‌, రవీంద్ర జడేజా, లసిత్‌ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌.

Story first published: Tuesday, September 14, 2021, 14:25 [IST]
Other articles published on Sep 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X