న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎదురుదెబ్బలే నన్ను ఇలా మార్చాయి: విహారీ

India vs west indies 2018 : Hanuma vihari Talks About His Hardwork
Setbacks have made me a better person: Hanuma Vihari

న్యూ ఢిల్లీ: టీమిండియాలో మార్పుల కోసం సెలక్టర్లు చాలా కాలంగా కష్టపడి కొంతకాలం నుంచి కీలక మార్పులు చేపడుతున్నారు. విదేశీ పర్యటనలతో పాటు ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేస్తున్నారు సెలక్టర్లు. ఈ క్రమంలో ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారీని ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా జట్టులోకి తీసుకున్నారు. ఇంతటి స్థాయిని తాను చేరుకోవడానికి జీవితంలో ఎదుర్కొన్న ఎదురు దెబ్బలే తననొక మెరుగైన మనిషిగా మార్చాయని టీమిండియా కొత్త ఆటగాడు హనుమ విహారి అన్నాడు.

'ఇలా కామెంట్ చేయడం తొలిసారిగా వింటున్నా''ఇలా కామెంట్ చేయడం తొలిసారిగా వింటున్నా'

జూనియర్‌ క్రికెటర్‌గా విహారి ఎన్నో కష్టాలు

జూనియర్‌ క్రికెటర్‌గా విహారి ఎన్నో కష్టాలు

ఆటుపోట్లే మనుషుల్ని వినయంగా మారుస్తాయన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో ఈ ఆంధ్రా క్రికెటర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. జూనియర్‌ క్రికెటర్‌గా విహారి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. 2005లో 12 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో అండర్‌-13 రాష్ట్ర జట్టులో చోటు పోయింది.

సన్‌రైజర్స్‌ తరఫున నాలుగు ఇన్నింగ్స్‌ల్లో

సన్‌రైజర్స్‌ తరఫున నాలుగు ఇన్నింగ్స్‌ల్లో

2012లో అండర్‌-19 ప్రపంచకప్‌లో చోటు దక్కలేదు. చివరి క్షణాల్లో మనన్‌ వోహ్రా గాయపడడంతో అతడి స్థానంలో విహారిని ఎంపికచేశారు. ఐపీఎల్‌లో 2015లో సన్‌రైజర్స్‌ తరఫున నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 39 పరుగులే చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో అతడిని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ఇలాంటి పరిణామాలే తనను మెరుగైన ఆటగాడిగా రూపొందించాయని విహారి అన్నాడు.

పాతాళంలోకి తొక్కేస్తాయని కఠినంగా మారా

పాతాళంలోకి తొక్కేస్తాయని కఠినంగా మారా

ఈ కష్టాలే నన్నో మెరుగైన మనిషిని చేశాయి. ఇవి మనల్ని వినయంగా మారుస్తాయి. సాధించాలన్న తపన పెంచుతాయి. విశ్రాంతి లేకుండా కష్టపడేలా చేసి అనుకున్నవి సాధించేలా చేస్తాయి. అవే మనల్ని కఠినంగా మారుస్తాయి. మనం వాటి పట్ల కఠినంగా లేకపోతే పాతాళంలోకి తొక్కేస్తాయి. అందుకే కఠినంగా మారా. ప్రతి అంతర్జాతీయ ఆటగాడికి ఓ కథ ఉంటుంది. ఇది నా కథ.

 మ్యాచ్‌లు గెలిపించాలనేదే ఉద్దేశం:

మ్యాచ్‌లు గెలిపించాలనేదే ఉద్దేశం:

వీటితోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సంబంధించి నా ఆలోచనా తీరులో మార్పు వచ్చింది. దూకుడుగా ఉండాలనుకున్నా. ఎలాంటి షాట్లు ఆడాలో నాకు తెలుసు. అయితే జట్టులో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నా. కేవలం పరుగులు చేయడమే కాదు మ్యాచ్‌లు గెలిపించాలన్నది ఉద్దేశం. క్రీజులో ఉంటే ప్రత్యర్థికి భయం పుట్టించాలని భావిస్తున్నానని విహారి అన్నాడు.

Story first published: Wednesday, October 17, 2018, 10:35 [IST]
Other articles published on Oct 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X