జోహన్నెస్‌బర్గ్‌లో ఇండియా హౌస్‌ను సందర్శించిన కోహ్లీ సేన (ఫోటోలు)

Posted By:

హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా కేప్‌టౌన్‌ వేదికగా తొలి టెస్టు ముగియడంతో రెండో టెస్టు కోసం కోహ్లీసేన సెంచూరియన్‌కు చేరుకుంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు శనివారం (జనవరి 13)న సెంచూరియన్‌లోని స్పోర్ట్ పార్క్‌ మైదానంలో జరగనుంది.

ఇండియా హౌస్‌ను సందర్శించిన టీమిండియా

ఇండియా హౌస్‌ను సందర్శించిన టీమిండియా

అయితే రెండో టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇండియా హౌస్‌ను గురువారం సాయంత్రం సందర్శించింది. గురువారం ఉదయం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్న భారత జట్టు ఆటగాళ్లు... అనంతరం ఇండియా హౌస్‌ సిబ్బంది ఆహ్వానం మేరకు జోహన్నెస్‌బర్గ్‌లో ఉన్న కార్యాలయానికి వెళ్లి ప్రత్యేక విందులో పాల్గొంది.

 ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్న బీసీసీఐ

ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్న బీసీసీఐ

ఈ సందర్భంగా పలువురు భారతీయులు ఆటగాళ్లతో కలిసి ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, సౌతాఫ్రికా యునైటెడ్ క్రికెట్ బోర్డ్ అడ్మినిస్ట్రేటర్ అలీ బాచర్‌ను టీమిండియా ఆటగాళ్లు కలిశారు.

బాచర్‌తో రవిశాస్త్రి మాటామంతీ

బాచర్‌తో రవిశాస్త్రి మాటామంతీ

ఈ సందర్భంగా బాచర్‌తో రవిశాస్త్రి ముచ్చటించారు. ఇండియా హౌస్‌ను సందర్శించిన వారిలో శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, బుమ్రా, మురళీ విజయ్, హార్దిక్ పాండ్య, భునేశ్వర్ కుమార్, రహానే ఉన్నారు. దక్షిణాఫ్రికాతో ముడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం ప్రస్తుతం కోహ్లీ సేన ఆ గడ్డపై పర్యటిస్తోంది.

 ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం ట్విట్టర్‌లో

ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం ట్విట్టర్‌లో

ఇదిలా ఉంటే ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ కూడా ఓ ఫొటోను తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘జోహెన్నెస్‌బర్గ్‌లోని హై కమిషన్‌ కార్యాలయాన్ని అందరం కలిసి సందర్శించాం. కొత్త దుస్తుల్లో ఆటగాళ్లను చూడటం ఆనందంగా ఉంది' అని ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు.

Story first published: Friday, January 12, 2018, 12:07 [IST]
Other articles published on Jan 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి