న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని అనుకరించబోయి.. ఫెయిలైన పాక్ కెప్టెన్

Sarfaraz Does a Dhoni Against Zimbabwe, Gets Tonked For Six

హైదరాబాద్: జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్‌ వైట్‌వాష్‌ చేసింది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆఖరి ఓవర్లలో పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌.. టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీని అనుకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అసలేం జరిగిందంటే.. జింబాబ్వే బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కీపింగ్‌ చేస్తున్న సర్ఫరాజ్‌ 48వ ఓవర్‌లో బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే గ్లోవ్స్‌ వదిలేసి బంతిని అందుకున్నాడు. ఫకార్‌జమన్‌ను కీపింగ్‌ చేయాల్సిందిగా కోరాడు.

అయితే తన మొదటి ఓవర్‌ అద్భుతంగా వేశాడు. కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ కూడా సర్ఫరాజ్‌ వేశాడు. అయితే ఈ ఓవర్‌లో జింబాబ్వే బ్యాట్స్‌మన్‌ పీటర్‌ మూర్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ను సాధించాడు. తన కెరీర్‌లో సర్ఫరాజ్‌ తొలిసారిగా రెండు ఓవర్లు వేసి 15 పరుగులు ఇచ్చాడు. శైలిలో మాత్రమే ధోనీలా బౌలింగ్ వేయగలిగాడు.

ధోనీని కాపీ చేసేందుకు యత్నించి..:

ధోనీని కాపీ చేసేందుకు యత్నించి..:

పాక్‌ కెప్టెన్‌.. భారత మాజీ కెప్టెన్‌ ధోనీని కాపీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. ధోనీ 2009లో జోహానెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయవంతంగా బౌలింగ్‌ చేసి ఒక వికెట్‌ కూడా తీశాడు. ధోనీలా బౌలింగ్‌ చేశాడు కానీ.. వికెట్‌ తీయలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఫకార్‌ జమాన్‌.. వన్డేల్లో వెయ్యి పరుగులు:

ఫకార్‌ జమాన్‌.. వన్డేల్లో వెయ్యి పరుగులు:

ఈ మ్యాచ్‌లో పాక్‌ బ్యాట్స్‌మన్‌ ఫకార్‌ జమాన్‌.. వన్డేల్లో వేగవంతంగా వెయ్యి పరుగులు పూర్తి చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 1000 పరుగులు చేయడానికి ఫఖర్‌ 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. గతంలో ఈ రికార్డు విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ (21 ఇన్నింగ్స్‌లలో) పేరిట ఉంది.

4 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు:

4 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు:

ఆదివారం ఇక్కడ జరిగిన చివరి వన్డేలో 131 పరుగుల తేడాతో జయభేరి మోగించిన పాక్‌ ఐదు వన్డేల సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇమామ్‌-ఉల్‌-హఖ్‌ (105 బంతుల్లో 110; 8 ఫోర్లు, 1 సిక్స్‌), బాబర్‌ ఆజమ్‌ (76 బంతుల్లో 106 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు చేసింది.

233 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది:

233 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది:

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 233 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. జింబాబ్వే బ్యాట్స్‌మెన్‌కు మంచి ఆరంభాలే లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ, నవాజ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బాబర్‌ ఆజమ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌', ఫఖర్‌ జమాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డులు దక్కాయి.

Story first published: Monday, July 23, 2018, 13:50 [IST]
Other articles published on Jul 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X