న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హత విధీ.. ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లతో.. సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ సైడ్‌ట్రాక్!

Sanju Samson brilliant knock against CSK was sidetracked after MS Dhoni hattrick sixes

హైదరాబాద్: భారత క్రికెట్‌లో అత్యంత దురదృష్టవంతుడైన ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అంటే అది కేరళ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ అనే చెప్పాలి. దేశవాళీ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు.. మరెన్నో ఘనతలు అందుకున్న ఈ కేరళ బ్యాట్స్‌మన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయాడు. 2013 నుంచి ఐపీఎల్ ఆడుతున్న శాంసన్ ప్రతీ సీజన్‌లో కనీసం ఒక్క ఆఫ్ సెంచరీనైనా చేశాడు.

ప్రతీ సీజన్‌లో..

ప్రతీ సీజన్‌లో..

ఇప్పటి వరకు మొత్తం 94 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 2283 రన్స్ చేశాడు. ఇన్నాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ సౌతిండియన్ వికెట్ కీపర్.. ఆడపాదడపా వచ్చిన అవకాశాల్లో అదృష్టం కలిసిరాక విఫలమయ్యాడు. అదే సమయంలో సెలెక్షన్ కమిటీ ధోనీ వారుసడని పంత్‌కు అండగా నిలవడంతో పత్తాలేకుండా పోయాడు. ఇక ఐపీఎల్ జరిగిన ప్రతీ సారి మాత్రం తన ధాటైన ఇన్నింగ్స్‌లతో అందరి దృష్టి ఆకర్షిస్తుంటాడు.

రెండే మ్యాచ్‌ల్లో..

రెండే మ్యాచ్‌ల్లో..

వన్డే ప్రపంచకప్ తర్వాత పంత్ విఫలమవడం.. శాంసన్ దేశవాళీ క్రికెట్‌లో ఇరగదీయడంతో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ ఆ సిరీస్‌లో రెండు అంటే రెండే మ్యాచ్‌ల్లో అవకాశం అందుకున్న శాంసన్ .. బంగారంలాంటి ఆ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు. తాజాగా ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో టీమిండియా వికెట్ కీపర్ పోస్ట్ ఖాళీ అయింది. ఆ స్థానాన్ని దక్కించుకోవాలంటే ఐపీఎల్ సరైన వేదికని భావించిన శాంసన్ తీవ్రంగా శ్రమించాడు. ఫిట్‌నెస్ దృష్టిసారించాడు. డైట్ మార్చాడు. కీపింగ్ స్కిల్స్ పెంచుకున్నాడు.

బ్యాటింగ్‌లో చెలరేగి.. కీపింగ్‌లో మెరిసి..

ఆ శ్రమకు ఫలితం మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఈ రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు దక్కింది. 32 బంతుల్లో 1 ఫోర్ 9 సిక్సర్లతో వీరవిహారం చేసిన శాంసన్(74).. కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. రెండు స్టంపౌట్స్, రెండు క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు. ఇందులో కేదార్ జాదవ్ ఇచ్చిన క్యాచ్ అందుకున్న విధానం అతని కీపింగ్ నైపుణ్యాన్ని తెలియజేసింది. శాంసన్ సూపర్ స్టార్‌తో రాజస్థాన్ ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించి మంచి శుభారంభాన్ని అందుకుంది. రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా వంటి క్లాస్ స్పిన్నర్లను శాంసన్ చితక్కొట్టాడు. అతని బ్యాటింగ్‌‌కు ధోనీనే ఏం చేయలేకపోయాడు. ఈ సూపర్ ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.

శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ సైడ్ ట్రాక్..

ఫస్ట్ మ్యాచ్‌లోనే అదరగొట్టి ఆత్మవిశ్వసాన్ని పెంచుకున్నాడు. కానీ ఈ అసాధారణ ఇన్నింగ్స్‌కు విలువే లేకుండా పోయింది. మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన హ్యాట్రిక్ సిక్స్‌లే హాట్ టాపిక్ అయ్యాయి. శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ సైడ్ ట్రాక్ అయ్యింది. క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు.. అందరి నోట వచ్చే మాటలు ధోనీ హ్యాట్రిక్ సిక్స్‌లు, తాల ఈజ్ బ్యాక్, ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్ ఎందుకు వచ్చాడు. మిడిలార్డ్‌లో వస్తే ఫలితం మరోలా ఉండేది. ధోనీ కొట్టిన బంతి బయటపడింది. ఓ అభిమాని ఇంటికి తీసుకెళ్లాడు. ధోనీ టచ్‌లోకి వచ్చాడు. ఉదయం నుంచి ఇదే తప్పా.. శాంసన్ టీమిండియా భవిష్యత్తు వికెట్ కీపర్ అయ్యే అవకాశం ఉందా? అని ఏ ఒక్కరూ కూడా మాట్లాడటం లేదు. ఇదే ఇన్నింగ్స్ రిషభ్ పంత్ ఆడితే ఎలా ఉండేదని శాంసన్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ధోనీ లెజెండ్ క్రికెటర్ అని, భారత క్రికెట్‌లో అతని శకం ముగిసిందని, ఇకనైనా యువ ఆటగాళ్లను ప్రోత్సహిద్దామని పిలుపునిస్తున్నారు.

అంబటి రాయుడు లేని లోటు కన్పించింది.. అతను ఉంటే ఫలితం మరోలా ఉండేది: ఎమ్మెస్కే ప్రసాద్

Story first published: Wednesday, September 23, 2020, 16:38 [IST]
Other articles published on Sep 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X