న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విజయానికి షార్ట్‌కట్స్‌ లేవు.. ఎప్పుడూ మోసం చేయొద్దు: సచిన్

Sachin Tendulkar : Whatever I am Today Is All Because Of Cricket | Oneindia Telugu
Sachin Tendulkar tells youngsters: Never take short cuts, dont cheat

ముంబై: కెరీర్‌లో పైకి ఎదిగే క్రమంలో దగ్గరి దారులు వెతకవద్దు. అసలు విజయానికి షార్ట్‌కట్స్‌ లేవు అని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ యువ ఆటగాళ్లకు సూచించారు. ఎప్పుడూ కూడా మోసం చేయొద్దు, మోసం చేస్తే అందరి ముందు తలదించుకొని నిలబడాల్సి వస్తుందని సచిన్ హెచ్చరించారు. సచిన్‌ తన సొంత క్రికెట్‌ అకాడమీ 'టెండూల్కర్‌ మిడిలెసెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ సెంటర్'ను మంగళవారం ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ మైక్‌ గ్యాటింగ్, ముంబై క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు విజయ్‌ పాటిల్‌ కూడా పాల్గొన్నారు.

<strong>నేడే మూడో టీ20.. సిరీస్‌పై భారత్ కన్ను.. ఒత్తిడిలో కివీస్‌!!</strong>నేడే మూడో టీ20.. సిరీస్‌పై భారత్ కన్ను.. ఒత్తిడిలో కివీస్‌!!

విజయానికి దగ్గరి దారులు లేవు:

విజయానికి దగ్గరి దారులు లేవు:

సచిన్‌ తన క్రికెట్‌ అకాడమీని ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ కుర్రాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. 'జీవితంలో ఎన్నో నేర్చుకున్నా. అంచనాలను అందుకోనప్పుడు క్రమశిక్షణ, ఏకాగ్రత, ప్రణాళిక, అమలుపై ఆలోచించా. నేనూ విఫలమయ్యాను. కానీ.. క్రీడలు, నాకు దొరికిన సరైన జట్టుతో తేరుకున్నా. ఈ క్రమంలో ఎలాంటి దగ్గరి దారులు లేవని అర్థమైంది. కష్టాలు ఎన్ని ఎదురైనా మోసం చేయొద్దు. ఎన్ని సవాళ్లు ఎదురైనా మోసం చేసైనా ముందుకు వెళ్లే ప్రయత్నం అస్సలు చేయొద్దు. అలా చేస్తే అందరి ముందు తల దించుకొని నిలబడాల్సి వస్తుంది' అని సచిన్‌ అన్నారు.

అజిత్‌ సలహాలు అమూల్యమైనవి:

అజిత్‌ సలహాలు అమూల్యమైనవి:

'క్రికెట్‌ గురించి నా సోదరుడు అజిత్‌తో నేను ఎప్పుడూ చర్చించేవాడిని. కెరీర్‌ ఆరంభమైన తొలి రోజు నుంచి వీడ్కోలు పలికే రోజు వరకు అజిత్‌తో మాట్లాడేవాడిని. అతడి సలహాలు ఎంతో అమూల్యమైనవి. నేను చివరి టెస్టులో అవుటైన తర్వాత కూడా దాని గురించి అన్నయ్యతో చర్చించా. మళ్లీ బ్యాటింగ్‌ చేయనని తెలిసి కూడా ఆ షాట్‌ను ఎలా ఆడాల్సిందని ఆయనతో విశ్లేచించుకున్నా. ఇదంతా నేర్చుకోవడమే. ఎప్పుడూ నేర్చుకోవడంను మాత్రం ఆపొద్దు' అని సచిన్ సూచించారు.

పిల్లలపై ఒత్తిడి చేయకండి:

పిల్లలపై ఒత్తిడి చేయకండి:

'నన్ను ఇంతటివాడిని చేసిన రెండో వ్యక్తి రమాకాంత్‌ అచ్రేకర్‌ సర్‌. ఆయన్ను ఇప్పుడు నేను మిస్‌ అవుతున్నా. నేనిప్పుడు ఇలా ఉండేందుకు కారణం ఆయనే. నా బాల్యం ఎప్పుడూ గుర్తుంటుంది. మనమంతా సరదాకైనా ఏదో ఒక క్రీడ ఆడాలి. భారత్‌ను క్రీడలను ప్రేమించే దేశంగా మార్చాలి. ఆరోగ్యానికీ, మంచి జీవన శైలికీ ఇది చాలా ముఖ్యం. తల్లిదండ్రులకు సూచించేది ఒక్కటే. క్రీడలైనా, చదువైనా పిల్లలపై ఒత్తిడి చేయకండి' అని సచిన్‌ చెప్పుకొచ్చారు.

Story first published: Wednesday, January 29, 2020, 9:47 [IST]
Other articles published on Jan 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X