తొలినాళ్లలో బ్యాటింగ్‌ కోసం సచిన్ నిరీక్షణ (ఫోటో)

Posted By:

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్... క్రికెట్‌లో రికార్డులు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వినిపించే మొట్టమొదటి పేరు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అంతర్జాతీయ రికార్డులను నెలకొల్పడంతో పాటు బద్దలు కొట్టాడు. సచిన్ బ్యాటింగ్‌ చూసేందుకు కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకి అతుక్కుపోయిన రోజులున్నాయి.

ఒకానొక దశలో సచిన్ బ్యాటింగ్‌ వరకు చూసి.. అతను అవుటైతే వెంటనే టీవీ ఆఫ్ చేసిన అభిమానులు సైతం ఉన్నారు. అంతలా తన ఆటతో అభిమానుల్ని సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ తన కెరీర్ తొలినాళ్లలో బ్యాటింగ్ అవకాశం కోసం ఆశగా ఎదురుచూసిన రోజులూ లేకపోలేదట.

Sachin Tendulkar Shares Age-old Image to Remind Fans of His Early Days

2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్... తాజాగా ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు. 'క్రీజులోకి వెళ్లేందుకు రెడీ అయ్యా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నా అవకాశం కోసం వేచి చూస్తున్నా' అంటూ సచిన్ తన ఇనిస్టాగ్రామ్‌లో కామెంట్ పెట్టాడు.

తన కెరీర్‌లో మొత్తం 200 టెస్టులు, 463 వన్డే మ్యాచ్‌లాడిన సచిన్ టెండూల్కర్ రెండు ఫార్మాట్లలో కలిపి వంద సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 16 ఏళ్ల వయసులోనే పాకిస్థాన్‌‌పై సచిన్ అరంగేట్రం చేసి అప్పట్లో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

All geared up, waiting for my turn to come in the batting line-up! #Nostalgia #ThrowbackThursday

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on Sep 13, 2017 at 10:21pm PDT

Story first published: Friday, September 15, 2017, 16:45 [IST]
Other articles published on Sep 15, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి