న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తినే సమయం కన్నా.. జిమ్‌లలోనే ఎక్కువ సమయం గడపండి: సచిన్

Sachin Tendulkars fitness mantra: Spend more time in gym, less at the dining table

హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం.. భారత క్రికెట్‌లో సంచలనం సచిన్ రిటైర్మెంట్ తర్వాత తరచూ సామాజిక మాధ్యమాల ద్వారా ఫిట్‌నెస్ గురించి ప్రస్తావించే సచిన్ మరోసారి అదే నేపథ్యంలో ప్రసంగించాడు. క్రీడలకు సంబంధించిన ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజరై మాట్లాడాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. మరోసారి ఫిట్‌నెస్‌కు ఉన్న ప్రాధాన్యత ఏంటో వివరించాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కంటే జిమ్‌ల్లో ఎక్కువ సమయం గడపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. తినడం కంటే జిమ్‌లలోనే ఎక్కువ సమయం కేటాయించాలని సూచించాడు.

భారత్.. క్రీడలను ఆడే దేశంగా కాకుండా క్రీడలను ప్రేమించే దేశంగా మారిపోతోంది. జనాల్లో ఫిట్‌నెస్ కొరవడడానికి ఇది ప్రధాన సమస్యే. నివేదికల ప్రకారం.. మధుమేహంలో ప్రపంచానికి అగ్రస్థానంలో ఉన్నాం. ఒబెసిటిలో మూడో స్థానంలో ఉన్నాం. ఈ సంఖ్యలను మార్చుకోకుంటే చెప్పుకోవడానికి కూడా ఏమి మిగలదు. దేశంలో యువత ఉండి కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరదు. అందుకే డైనింగ్ టేబుల్ దగ్గర కంటే జిమ్‌లలో ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుంటుంది. కానీ దృక్పథం మరోలా ఉంటుంది.

<strong>టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే పెర్త్ లాంటి పిచ్‌లు అవసరం: సచిన్</strong>టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే పెర్త్ లాంటి పిచ్‌లు అవసరం: సచిన్

జిమ్‌లలో ఉన్నప్పుడు నా 20 నిమిషాల ట్రేడ్‌మిల్ ఎప్పుడు ముగుస్తుందా? అని తరచూ గడియారం వైపు చూస్తు ఉంటాం. ఒక్కోసారి 15 నిమిషాల్లోనే ముగిస్తాం. అదే డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటే అదే పనిగా కిచెన్ వైపు చూస్తాం. తర్వాత బక్రీ తిందామా, పరోటా తిందామా అని ఎదురుచూస్తుంటాం. ఇక్కడ వేచి చూసే ఆ ఐదు నిమిషాలు జిమ్‌లో కేటాయిస్తే మన శరీరం గణనీయంగా మెరుగుపడుతుంది అని ఓ కార్యక్రమంలో సచిన్ వ్యాఖ్యానించాడు.

భారత్‌ను క్రీడలు ఆడే దేశంగా తయారు చేసే దిశగా ప్రతి ఒక్కర్ని ప్రోత్సాహపరచడమే తన నూతన సంవత్సర తీర్మానం అని పెద్ద ఎత్తున హాజరైన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వాసయ్ తాలుక కలా, క్రీడా మహోత్సవ్ 2018, స్పోర్ట్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి హాజరైయ్యారు. సచిన్‌తో పాటుగా హరిహరన్, మృనాల్ కుల్‌కర్ణిలు విచ్చేశారు.

Story first published: Thursday, December 27, 2018, 10:46 [IST]
Other articles published on Dec 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X