న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మగాళ్లు ఏడిస్తే తప్పేం కాదు: పురుషులందరికీ సచిన్‌ ఓ బహిరంగ లేఖ

Sachin Tendulkar Says 'No Shame In Showing Your Tears' || Oneindia Telugu
Sachin Tendulkar pens an open letter to the men of today, and tomorrow

హైదరాబాద్: మగాళ్లు కన్నీళ్లను దాచనవసరం లేదని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. అంతర్జాతీయ పురుషుల వారోత్సవాల సందర్భంగా పురుషులందరికీ సచిన్‌ టెండూల్కర్ ఓ బహిరంగ లేఖ రాశారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సందర్భంగా సచిన్ తన చివరి మ్యాచ్‌‌లో భావోద్వేగ ప్రసంగం చేశాడు.

ఆ రోజు సచిన్ మాట్లాడుతున్న సమయంతో ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. సచిన్ కళ్లల్లో నీళ్లు తిరగడాన్ని భారత క్రికెట్‌ అభిమానులెవరూ మరచిపోలేరు. ఆ సమయంలో తన మనసులో ఎన్నో ఆలోచనలు చెలరేగుతుండటం వల్లనే తాను కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయానని సచిన్‌ గుర్తు చేసుకున్నాడు.

అడిలైడ్ టు కోల్‌కతా పింక్ బాల్ ప్రయాణం సాగిందిలా!: 12వ నగరంగా కోల్‌కతాఅడిలైడ్ టు కోల్‌కతా పింక్ బాల్ ప్రయాణం సాగిందిలా!: 12వ నగరంగా కోల్‌కతా

కన్నీళ్లను ఆపాలని నేను ప్రయత్నించలేదు

కన్నీళ్లను ఆపాలని నేను ప్రయత్నించలేదు

"ఆ సమయంలో కన్నీళ్లను ఆపాలని నేను ప్రయత్నించలేదు. మగాళ్లయినా సరే కన్నీరు కారిస్తే తప్పేం కాదు. నిన్ను బలవంతుడిని చేసే ఒక భాగాన్ని ఎందుకు దాచుకోవాలి? కన్నీళ్లను ఎందుకు దాచాలి? ఏడుపు మగాళ్లను బలహీనులను చేస్తుందని విశ్వసించాం. ఇదే నిజమని వింటూ నేనూ పెరిగాను. అది తప్పని తెలుసుకున్నాను కాబట్టే ఈ లేఖ రాస్తున్నాను. నా పోరాటం, బాధలే నన్ను ఇంతటివాడిని చేశాయి" అని సచిన్ అన్నారు.

చాలా ధైర్యం అవసరం

చాలా ధైర్యం అవసరం

"మన బాధను ప్రదర్శించేందుకు చాలా ధైర్యం అవసరం. ప్రతిరోజు తప్పకుండా ఉదయిస్తున్నట్టే కష్టాల నుంచి శక్తి మంతులవుతారు. అందుకే ఇలాంటి అపోహల నుంచి బయట పడండి. భావోద్వేగాలు బయట పెట్టేందుకు ధైర్యం చేయండి. నేనూ ఆందోళన, బాధలు, సందేహాలను ఎదుర్కొన్నాను. ఏడవడంలో తప్పులేదు. ఆ తర్వాత మనోధైర్యంతో ఉండాలి. ఎందుకంటే మగాళ్లు చేయాల్సింది అదే" అని సచిన్ ఆ లేఖలో పేర్కొన్నారు.

క్రైమ్‌లో భాగస్వాములం: ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ కోహ్లీ ట్వీట్

నాకు ఏడుపొచ్చింది

"రిటైర్మెంట్ సందేశం ఇచ్చేటప్పుడు నాకు ఏడుపొచ్చింది. ఆఖరి సారి ఔటై పెవిలియన్‌ ఒక్కోమెట్టు ఎక్కుతున్నప్పుడు కుంగిపోతున్నట్టు అనిపించింది. నా బుర్రలో ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి. వాటిని దాచుకోలేకపోయాను. నేను ప్రపంచం ముందుకు వెళ్లినప్పుడు ప్రశాంతంగా ఉంది. నా కష్టానికి తగిన ఫలితం లభించినందుకు సంతోషంగా అనిపించింది" అని సచిన్ ఆ లేఖలో రాసుకొచ్చారు.

Story first published: Thursday, November 21, 2019, 7:58 [IST]
Other articles published on Nov 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X