క్రైమ్‌లో భాగస్వాములం: ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ కోహ్లీ ట్వీట్

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో విరాట్ కోహ్లీతో పాటు పలువురు టీమిండియా ఆటగాళ్లు వర్షంలో తడుస్తున్నారు. అయితే, తనకు ఎదురుగా ఉన్న ఆటగాడు ఎవరో చెప్పాలని అభిమానులను కోరాడు.
కోహ్లీకి ఎదురుగా నడుచుకుంటూ ఓ ఆటగాడు వస్తున్నాడు. ఆ ఫోటోని తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన కోహ్లీ "క్రైమ్‌లో బాగస్వాములం. బౌండరీల వద్ద ఫీల్డర్స్ నుంచి డబుల్స్ దొంగిలిస్తాం. ఎవరో చెప్పండి" అంటూ కామెంట్ పెట్టాడు. ఆ ఫోటోని పరిశీలిస్తే కోహ్లీకి ఎదురుగా ఉన్న ఉన్న ధోని అని ఇట్టే అర్ధమవుతుంది.
వెస్టిండిస్‌తో వన్డే, టీ20 సిరిస్‌లకు గురువారం సెలక్టర్లు జట్టుని ప్రకటించనున్నారు. ఈ మేరకు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్టర్ల కమిటీ గురువారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో సమావేశం కానుంది. విండిస్‌తో సిరిస్‌కు ధోనీని మళ్లీ జట్టులోకి తీసుకోనున్నట్టు సమాచారం.
చాన్నాళ్ల తర్వాత ధోనీ మళ్లీ జట్టులోకి వస్తున్నాడని కాబట్టి... దానికి సంకేతంగా విరాట్ కోహ్లీ ఈ ఫొటోను ట్వీట్ చేసినట్టు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. కాగా, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాతో జరిగే డే నైట్ టెసులో తనమునకలైంది.
ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాలు ఎటువంటి ఏర్పాట్లు చేసిందో బుధవారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసీసీఐ) ఓ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
నవంబర్ 22 నుంచి 26 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి డే నైట్ టెస్టుకు క్యాబ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ డే నైట్ టెస్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్యాబ్ అంగరంగవైభవంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే కోల్‌కతాలోని వీధులన్నీ గులాబీ మయం అయ్యాయి.
డే నైట్ టెస్టు కోసం ఈడెన్ గార్డెన్స్‌ను క్యాబ్ ఏ విధంగా ముస్తాబు చేసిందో 17 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో క్లిప్ బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటూ "పింక్ బాల్ టెస్టు కోసం కోల్‌కతా సిద్దమైంది" అనే కామెంట్ పోస్టు చేసింది. వీడియోలో ఈడెన్ గార్డెన్స్ గులాబీ రంగుతో అందంగా ముస్తాబైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications