న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరోసారి గొప్పమనసు చాటుకున్న సచిన్.. పేద రైతు కుమార్తెకు సాయం! డాక్టర్‌ అయ్యేంతవరకు!

Sachin Tendulkar Helps Poor Farmers Daughter Dipti Vishwasrao
Sachin Tendulkar Helps Farmer's Daughter To Pursue Dream Of Becoming Doctor | Oneindia Telugu

హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆపదలో ఎవరు ఉన్నా తనకు తోచిన సాయం చేస్తుంటారు. మాస్టర్ బ్లాస్టర్ పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. గతేడాది ప్రమాదకర కరోనా వైరస్‌పై పోరాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తనవంతు సాయం చేశారు. అదే సమయంలోనే కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు, వ‌ల‌స కూలీలకు అండగా నిలిచారు. తాజాగా సచిన్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. ఈసారి ఓ పేద రైతు కుమార్తె కలను నిజం చేశారు. డాక్టర్‌ అయ్యేంతవరకు ఆ విద్యార్థికి అయ్యే ఖర్చులను భరించనున్నారు.

టీమ్ సెలక్షన్‌కు ముందు కాల్స్ వస్తున్నాయి.. ప్లేయర్స్‌ను తీసుకోమని రికమండ్‌ చేస్తున్నారు: మాజీ కెప్టెన్ టీమ్ సెలక్షన్‌కు ముందు కాల్స్ వస్తున్నాయి.. ప్లేయర్స్‌ను తీసుకోమని రికమండ్‌ చేస్తున్నారు: మాజీ కెప్టెన్

డాక్టర్‌ పట్టా పొందేవరకు:

డాక్టర్‌ పట్టా పొందేవరకు:

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా జైరే ప్రాంతానికి చెందిన ఓ పేద రైతు కుమార్తె దీప్తి విశ్వాస్‌ రావు. డాక్టర్‌ కావాలని దీప్తి చిన్నప్పటి నుంచి కలలు కనేది. అందుకోసం చాలా కష్టపడింది. మెరిట్ మార్కులతో చివరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దీప్తి సీటు సంపాదించింది. అయితే దీప్తి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మెడికల్ విద్య కోసం అయ్యే ఖర్చు వారికి భారంగా మారింది. ఈ విషయం 'సేవా సహ్యోగ్‌' అనే స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. దీప్తి కష్టాలనుక్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ ఫౌండేషన్‌ 'ఎస్‌ఆర్‌టీ10' దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన ఆ ఫౌండేషన్.. ఆ విద్యార్థి డాక్టర్‌ పట్టా పొందేవరకు అయ్యే ఖర్చులను భరించనున్నట్లు పేర్కొంది. సచిన్‌ సాయంతో దీప్తి ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తోంది.

ఎంతో రుణపడి ఉంటా:

దిప్తీ విశ్వాస్‌ రావు ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను పంచుకొని సచిన్‌ టెండూల్కర్‌కు ధన్యవాదాలు తెలిపింది. 'ప్రస్తుతం నేను అకోలాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాను. మా నాన్న రైతు. మా అమ్మ గృహిణి. మాది పేద కుటుంబం. కష్టపడితేనే విజయం వరిస్తుందని తెలుసుకున్నా. బాగా చదివాను. నేను పడిన కష్టానికి ప్రతిఫలంగానే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సీటు సంపాదించా. నాకు స్కాలర్‌షిప్ అందిస్తున్న సచిన్‌ టెండూల్కర్ సర్ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు. నేను ఆయనకు ఎంతో రుణపడి ఉంటా' అని దీప్తి తెలిపింది.

మరింత ఎత్తుకు ఎదగాలి:

మరింత ఎత్తుకు ఎదగాలి:

సచిన్‌ టెండూల్కర్ కూడా దిప్తీ విశ్వాస్‌ రావు చేసిన ట్వీట్‌పై స్పందించారు. ఈ సందర్భంగా దిప్తీ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. కలలు కంటూ వాటిని ఎలా సాధించాలో దీప్తి నిరూపించిందని సచిన్ అన్నారు. అనుకున్న లక్ష్యాలను చేరేందుకు విద్యార్థిని ప్రయాణం ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని క్రికెట్ దిగ్గజం ఆకాంక్షించారు. సచిన్ సాయంపై నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఎప్పటినుండో సచిన్ చాలా ఛారిటీ సంస్థలకు తన వంతు సాయం చేసేవారు. అయితే ఇది ఎప్పుడూ ప్రజల దృష్టికి మాత్రం రాలేదు.

క్రికెట్​లో 100 సెంచరీలు:

క్రికెట్​లో 100 సెంచరీలు:

16 ఏళ్ల ప్రాయంలో క్రికెట్ ఆటలోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్​.. ప్రపంచ క్రికెట్​పై తనదైన ముద్ర వేశారు. టెస్ట్, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డులు మాస్టర్​ బ్లాస్టర్​ పేరుపైనే ఉన్నాయి. వన్డేల్లో తొలి డబుల్, క్రికెట్​లో 100 సెంచరీలు ఇలా ఎన్నో రికార్డులు ఉన్నాయి. 1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ‌ఆడిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34357 పరుగులు బాదారు. టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ చేశారు.

Story first published: Wednesday, July 28, 2021, 20:11 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X