న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆట నుంచి ఎప్పుడు తప్పుకోవాలో ధోనికి తెలుసు: సచిన్

By Nageshwara Rao
Sachin Tendulkar Backs MS Dhoni Over Retirement Speculations
Sachin Tendulkar backs MS Dhoni over retirement speculations

హైదరాబాద్: క్రికెట్ నుంచి ఎప్పుడు తప్పుకోవాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తెలుసని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఇంగ్లాండ్‌ వేదికగా ముగిసిన వన్డే సిరీస్‌లో ధోని విఫలమైన కారణంగానే భారత్‌ సిరీస్‌ కోల్పోయిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

మాజీ క్రికెటర్లు సైతం ధోని రిటైర్మెంట్‌ సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తన కెప్టెన్‌(ధోని సారథ్యంలో 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత్) ధోనికి మద్దతుగా నిలిచిన సచిన్‌ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ ఆట నుంచి ఎప్పుడు తప్పుకోవాలో అతడికి తెలుసు అన్నారు.

 ధోనిలో ఆడే సత్తా ఉంది

ధోనిలో ఆడే సత్తా ఉంది

"ఇంగ్లాండ్ సిరీస్‌లో ధోని రాణించపోయినా, అతడిలో ఆడే సత్తా ఉంది. ఆటగాడికి తనపై పూర్తి విశ్వాసం ఉన్నంతకాలం ఆటలో కొనసాగవచ్చు. జట్టులో తీసుకునే సమయంలో మాత్రమే ఆటగాడి చేతిలో నిర్ణయం ఉండదు. కానీ రిటైర్మెంట్‌ విషయంలో ఆటగాళ్లకు స్వేచ్ఛ ఉంటుంది" అని సచిన్ అన్నాడు.

చాలా కాలం క్రికెట్‌ను ఆస్వాదించాడు

చాలా కాలం క్రికెట్‌ను ఆస్వాదించాడు

"ధోని చాలా కాలం క్రికెట్‌ను ఆస్వాదించాడు. ఇతరుల కంటే ఆటను చాలా బాగా అంచనా వేయగల సామర్థ్యం ధోని సొంతం. అతడితో కలిసి క్రికెట్‌ ఆడాను కనుక కెరీర్‌కు ఎప్పుడు గుడ్‌బై చెప్పాలన్న నిర్ణయం నా కెప్టెన్‌ ధోనికే వదిలేయడం ఉత్తం" అని ధోని గురించి సచిన్ పేర్కొన్నాడు.

అంపైర్ల నుంచి బంతిని తీసుకున్న ధోని

అంపైర్ల నుంచి బంతిని తీసుకున్న ధోని

ఇంగ్లాండ్‌తో లీడ్స్‌ వేదికగా చివరి వన్డే ముగిసిన అనంతరం అంపైర్ల నుంచి ధోని బంతిని తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ధోని క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడంటూ వదంతులు ప్రచారమయ్యాయి. 2014లో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించే సందర్భంలోనూ అంపైర్ల నుంచి బెల్స్ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్‌కు మరింత బలం చేకూర్చింది.

ధోని రిటైర్మెంట్ వార్తలపై కోచ్ రవిశాస్త్రి

ధోని రిటైర్మెంట్ వార్తలపై కోచ్ రవిశాస్త్రి

అయితే, మ్యాచ్ అనంతరం కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ "ధోని ఎటూ వెళ్లటం లేదు.. టీమిండియాతో అతడు ఇంకొంత కాలం ప్రయాణిస్తాడు. బంతిని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడు. మ్యాచ్‌లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి ఒక జనరల్‌ ఐడియా కోసం తీసకున్నాడే తప్పా ఏ రిటైర్మెం‍ట్‌ ఉద్దేశం లేదు. ఆ బంతిని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు చూపించేందుకు మాత్రమే తీసుకున్నాడు. అంతేకానీ, రిటైర్మెంట్‌ యోచనలో ఉండి తీసుకోలేదు. భరత్‌కు ఆ బంతిని చూపించి మ్యాచ్‌లో పడిన ఇబ్బందులు గురించి చర్చించడానికి ధోనీ అలా చేశాడు" అని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, July 25, 2018, 17:52 [IST]
Other articles published on Jul 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X