న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sachin Tendulkars all-time best XI : ధోనీతో పాటు కోహ్లీ, రోహిత్‌కు నో చాన్స్!

Sachin Tendulkar’s all-time best XI: No Chance for MS Dhoni and Virat Kohli

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఎవరూ ఉండరు. 16 ఏళ్ల ప్రాయంలో క్రికెట్ ఆటలోకి అడుగుపెట్టిన లిటిల్ మాస్టర్​.. ప్రపంచ క్రికెట్​పై తనదైన ముద్ర వేసాడు. టెస్ట్, వన్డేల్లో అత్యధిక పరుగులతో అద్భుతమైన రికార్డులు అందుకున్నాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ, క్రికెట్​లోనే 100 సెంచరీలు ఇలా ఎన్నో రికార్డులను తన పేరుపై లిఖించుకున్నాడు. క్రికెట్‌ ప్రపంచానికే సరికొత్త గణాంకాలను పరిచయం చేశాడు. వన్డేల్లో 15,921, టెస్ట్‌ల్లో 18,426 రన్స్ చేశాడు. అలాంటి సచిన్ తాజాగా తన ఆల్‌టైమ్ బెస్ట్ ఎలెవన్ ప్రకటించాడు. ఈ జట్టులో తన పేరుతో పాటు మరెందరో దిగ్గజ ఆటగాళ్లను సచిన్ విస్మరించాడు.

భారత దిగ్గజాలకు నోచాన్స్..

భారత దిగ్గజాలకు నోచాన్స్..

తొలి ప్రపంచకప్ విజయంతో భారత్‌లో క్రికెట్‌ను మతంలా మార్చిన దిగ్గజ కెప్టెన్ కపిల్‌దేవ్‌తో పాటు మూడు ఐసీసీ టైటిళ్లు అందించి.. అత్యుత్తమ సారథిగా యావత్ క్రికెట్ ప్రపంచం మెచ్చిన మహేంద్ర సింగ్ ధోనీకి సచిన్ ఈ జట్టులో చోటివ్వలేదు. అంతేకాదు.. ఈ తరం క్రికెట్‌లో టన్నులకొద్ది పరుగులతో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా కీర్తించబడుతున్న విరాట్ కోహ్లీతో పాటు వన్డే క్రికెట్‌లోనే అసాధ్యమైన డబుల్ సెంచరీని సుసాధ్యం చేసి.. మూడు సార్లు ఈ ఘనతను అందుకున్న రోహిత్ శర్మకూ ఈ జట్టులో చోటివ్వలేదు. తన స్పిన్ బౌలింగ్‌తో మేటీ బౌలర్‌గా గుర్తింపు పొందిన అనిల్ కుంబ్లేకు కూడా ఈ జట్టులో చాన్స్ దక్కలేదు.

సునీల్ గవాస్కర్‌కు చాన్స్..

సునీల్ గవాస్కర్‌కు చాన్స్..

భారత్ నుంచి నలుగురి ఆటగాళ్లను తీసుకున్న సచిన్.. ఆశ్చర్యకరంగా సునీల్ గవాస్కర్‌కు అవకాశమిచ్చాడు. అంతేకాకుండా తన పార్టనర్, విధ్వంసకర బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్‌‌ను ఓపెనర్‌గా ఎంచుకున్నాడు. భారత క్రికెట్‌లో విప్లవం తీసుకొచ్చిన దిగ్గజ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీని ఎంపిక చేసిన సచిన్.. స్పిన్నర్‌గా హర్భజన్ సింగ్‌కు చోటిచ్చాడు. ఇక ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్‌‌ను కూడా లిటిల్ మాస్టర్ విస్మరించాడు.

ఓపెనర్లుగా సెహ్వాగ్, గవాస్కర్‌

ఓపెనర్లుగా సెహ్వాగ్, గవాస్కర్‌

సచిన్ ఆల్‌టైమ్ బెస్ట్ ఎలెవన్‌‌ను పరిశీలిస్తే.. ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్‌ను ఎంపిక చేశాడు. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా బ్రియాన్ లారా, వీవీ రిచర్డ్స్, జాక్వస్ కల్లీస్, సౌరవ్ గంగూలీ‌లను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్‌గా ఆల్‌టైమ్ బెస్ట్ ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌‌ను తీసుకున్నాడు. స్పిన్నర్లుగా షేన్ వార్న్, హర్భజన్ సింగ్‌లను తీసుకున్న సచిన్.. పేసర్లుగా గ్లేన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్‌లకు చోటిచ్చాడు. సచిన్ జట్టులో భారత్ నుంచి నలుగురుండగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ముగ్గురు, వెస్టిండీస్ ప్లేయర్లు ఇద్దరు చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా, పాకిస్థాన్ నుంచి ఒక్కో ప్లేయర్‌కు అవకాశం దక్కింది.

సచిన్ ఆల్‌టైమ్ బెస్ట్ ఎలెవన్

సచిన్ ఆల్‌టైమ్ బెస్ట్ ఎలెవన్

వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, వీవీ రిచర్డ్స్, జాక్వస్ కల్లీస్, సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్(కీపర్), షేన్ వార్న్, హర్భజన్ సింగ్, గ్లేన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్.

Story first published: Thursday, January 6, 2022, 18:17 [IST]
Other articles published on Jan 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X