న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్: ప్రపంచ క్రికెట్ లో ఒకే ఒక్కడు

By Pratap
Sachin Tendulkar
గ్వాలియర్: భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరోసారి ప్రపంచ క్రికెట్ చరిత్రను తిరగరాశాడు. భారత ప్రజలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించాడు. ప్రపంచ వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్ మన్ గా చరిత్ర సృష్టించాడు. తనకు మరెవరూ సాటిరారని మరోసారి నిరూపించాడు. భారత క్రికెట్ జట్టులో వయస్సులో పెద్దవాడైన టెండూల్కర్ యువకిశోరంలా రెచ్చిపోయాడు. తనలో చేవ చావలేదని రుజువు చేశాడు. దక్షిణాఫ్రికాపై గ్వాలియర్ లో జరిగిన రెండో వన్డే మ్యాచులో ఆ ఫీట్ సాధించాడు. వన్డేల్లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 39 ఏళ్ల వన్డే అంతర్జాతీయ క్రికెట్ లో ఏ క్రికెటర్ కూ సాధ్యం కాని ఫీట్ సాధించాడు. తన డబుల్ సెంచరీని సచిన్ దేశ ప్రజలకు అంకితమిచ్చాడు. ఇన్నేళ్లు తనకు తోడుగా నిలిచినందుకు వారికి ఆయన ఈ నజరానా ఇచ్చాడు. డబుల్ సెంచరీ చేసి అజేయంగా నిలిచి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

22 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (ఫిబ్రవరి 24న) మిత్రుడు వినోద్ కాంబ్లితో కలసి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులతో చరిత్ర లిఖించిన సచిన్, ఇప్పుడు వన్డే క్రికెట్‌లో రికార్డు సృష్టించడం కూడా సంచలనమే. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన 21 ఏళ్లకు మూడున్నర గంటలు క్రీజ్‌లో నిలబడి తొలి బంతి నుంచి చివరి బంతి దాకా ఆడి 25 ఫోర్లు, 3 సిక్స్‌లతో 203 పరుగులు సాధించాడు. కేవలం 147 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి తన సత్తాను చాటుకున్నాడు. సౌతాఫ్రికన్ సఫారీస్‌కే ముచ్చెమటలు పట్టించాడు. రూప్‌సింగ్ స్టేడియం నలుమూలలకూ బంతిని తిప్పుతూ స్ట్రోక్‌ప్లేతో అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు.

36 ఏళ్ల సచిన్ పేరిట ఇప్పటికే ఆయన వయసుకు రెట్టింపు రికార్డులు నమోదై ఉన్నాయి. 5.5 అడుగుల ఈ ముంబయ్ యువకిశోరం సాధించిన వాటిలో అనేకం అజేయమైనవే. అయితే అన్నింటికంటే ఈ రికార్డు వెరీవెరీ స్పెషల్. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అనేక మంది మేటి క్రికెటర్లు దీన్ని సాధించడానికి పలు విధాలా ప్రయత్నించి భంగపడ్డారు. కొందరు గెలుపు వాకిట బొక్క బోర్లా పడ్డారు. 13 ఏళ్ల క్రితం పాకిస్థానీ బ్యాట్స్‌మన్ సయీద్ అన్వర్, ఇటీవల జింబాబ్వే ఆటగాడు కోవెంట్రీ సాధించిన 194 పరుగులే నిన్నటిదాకా వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోర్! వయసులో సగానికన్నా ఎక్కువకాలం స్టేడియంలోనే గడిపిన సచిన్‌కు కూడా ఈ రికార్డు ఎన్నో ఏళ్లుగా అందీ అందకుండా ఊరిస్తోంది. నిరుడు రెండుసార్లు సమీపంలోకి వచ్చి మిస్సైన దీన్ని సచిన్ ఈసారి వీరోచితంగా ఒడిసి పట్టుకున్నాడు. ఇప్పటిదాకా సచిన్ వన్డే బెస్ట్ స్కోరు 186 నాటౌట్, దీన్ని 1999లో న్యూజిల్యాండ్‌పై హైదరాబాద్‌లో సాధించాడు. దాదాపు దశాబ్దం తర్వాత సచిన్, హోరెత్తించే స్కోర్‌తో హైదరాబాద్ ఫీట్‌ను అధిగమించగలిగాడు.

అతడు క్రికెట్‌కే గర్వకారణమని, క్రికెట్ వజ్రమని ప్రశంసించారు. ప్రధాని మన్మోహనే కాదు, యావత్ భారత క్రీడాలోకం సచిన్ ఘనతతో పరవశించి ప్రశంసించింది. తాజా మ్యాచ్‌లో వన్డే క్రికెట్‌లో 46వ శతకం నమోదు చేసిన సచిన్, 'సెంచరీల హాఫ్ సెంచరీ'కి కేవలం మరో నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు.గ్వాలియర్‌లో సాధించిన అజేయ డబుల్ సెంచరీతో సచిన్ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

వన్డేల్లో అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.

సచిన్ - 200*, కోవెంట్రీ - 194*, సయీద్ అన్వర్ - 194, వివియన్ రిచర్డ్స్ - 189*, జయసూర్య - 189, కిర్‌స్టెన్ - 188*, సచిన్ - 186*, ఎం.ఎస్.ధోనీ - 183*, గంగూలీ - 183

వన్డేల్లో సచిన్ రికార్డులు-

అత్యధిక వ్యక్తిగత స్కోరు - 200 నాటౌట్ (గ్వాలియర్, 2010)
అత్యధిక పరుగులు: 17,598 (సగటు 45.12)
అత్యధిక శతకాలు : 46;
అత్యధిక అర్ధసెంచరీలు: 93
ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగుల్ని ఏడుసార్లు చేశాడు.
వన్డేలాడే అన్ని ప్రధాన దేశాలపైనా 1000కిపైగా రన్స్ సాధించాడు.
ఫైనల్ మ్యాచ్‌ల్లో అత్యధిక శతకాలు: 6
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు: 61
మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు : 15
ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు: 1,894 (1998లో)
ఓ వరల్డ్‌కప్ (2007)లో అత్యధిక పరుగులు-1796
బ్రేక్ లేకుండా వరుసగా అత్యధిక వన్డేలు: 185

టెస్టుల్లో రికార్డు -

స్టీవ్‌వా (168) తర్వాత అత్యధిక టెస్ట్‌లాడింది సచినే (166)
అత్యధిక పరుగులు: 13,44
7 అత్యధిక శతకాలు: 4
7 విదేశాల్లో అత్యధిక పరుగుల రికార్డు: 7,429
12,000, 13,000 పరుగుల మైలురాళ్లు దాటిన తొలి ఆటగాడు
20ఏళ్ల వయస్సుకు ముందే ఐదు సెంచరీలతో ప్రపంచ రికార్డు

వన్డేలు-టెస్ట్‌లు కలిపి..

93 సెంచరీలు (టెస్ట్‌ల్లో 47, వన్డేల్లో 46)

క్రికెట్ చరిత్రలో 30,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X