న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs PAK: క్వింటన్ డికాక్ తొండాట.. ఫకర్‌ జమాన్ 193 వృథా.. మండిపడుతున్న ఫ్యాన్స్!

SA vs PAK: Quinton de Kock distracts Fakhar Zaman to run him out, What does the ICC rule state?

జొహన్నెస్‌బర్గ్‌: సౌతాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ఆధ్యాంతం ఉత్కంఠగా సాగుతుంది. తొలి వన్డేలో పాకిస్థాన్ ఆఖరి బంతికి విజయాన్నందుకోగా.. రెండో వన్డేలో ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ (155 బంతుల్లో18 ఫోర్లు, 10 సిక్స్‌లతో 193) పోరాటం ఆకట్టుకుంది. అయితే మైదానంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ క్రీడాస్పూర్తిని మరచి ఫకర్ జమాన్ రనౌటయ్యేలా అతన్ని దష్టిని మలిచాడు. దాంతో సౌతాఫ్రికా 17 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం చెరో విజయంతో పాక్, సౌతాఫ్రికా 1-1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది

చెలరేగిన బ్యాట్స్‌మెన్..

చెలరేగిన బ్యాట్స్‌మెన్..

ఆదివారం జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేసింది. డికాక్‌ (80; 10 ఫోర్లు, సిక్స్‌), బవూ మా (92; 9 ఫోర్లు), డస్సెన్‌ (37 బంతుల్లో 60; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిల్లర్‌ (27 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం 342 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పాక్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసి ఓడింది. చివరి ఓవర్లో పాక్‌ విజయానికి 30 పరుగులు అవసరం కాగా... తొలి బంతికే ఫకర్‌ ఔటవ్వడంతో పాక్‌ ఓటమి ఖాయమైంది.

ఫకర్ అసాధారణ పోరాటం..

ఫకర్ అసాధారణ పోరాటం..

భారీ లక్ష్య చేధనకు దిగిన పాకిస్థాన్ ఆదిలోనే తడబడింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(31) మినహా.. ఇమామ్ ఉల్ హక్(5), మహ్మద్ రిజ్వాన్(0), డానిష్ అజిజ్(9), షాదా్ ఖాన్(13) దారుణంగా విఫలమవడంతో పాకిస్థాన్ 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ లెక్కన పాక్ 200 పరుగుల లోపే ఆలౌటవుతుందని అంతా భావించారు. కానీ ఫకార్ జమాన్ ఒంటరి పోరాటం చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్ సహకారం అందకపోయినా ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకుంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే

సెంచరీ పూర్తి చేసుకొని డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లి ఆఖరి ఓవర్లో రనౌటయ్యాడు.

డికాక్ తొండాట..

చివరి ఓవర్‌లో పాక్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా.. ఎంగిడి వేసిన బంతిని జమాన్ లాంగాఫ్ దిశగా ఆడాడు. అయితే రెండో పరుగు తీసే క్రమంలో రనౌటయ్యాడు. ఇక్కడ డికాక్ క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడు. ఫకర్ జమాన్‌ను ఫూల్ చేశాడు. జమాన్ రెండో పరుగు తీసే క్రమంలో బౌలర్ వైపు బంతిని వేయాలని ఫీల్డర్‌కు సూచిస్తూ గట్టిగా అరిచాడు. దాంతో జమాన్ వెనక్కి తిరగ్గా.. బంతిని అందుకున్న డికాక్ వికెట్లను కొట్టేశాడు. అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరూ డికాక్ స్మార్ట్‌గా ఆలోచించారంటే.. మరికొందరు ఇది తొండాట అంటూ మండిపడుతున్నారు.

ఐసీసీ రూల్స్‌లో..

ఐసీసీ రూల్స్‌లో..

అయితే ఐసీసీ నిబంధనలోని 41.5 రూల్ ప్రకారం మైదానంలో ఫీల్డర్, బౌలర్, కీపర్ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వారి చర్యల ద్వారా బ్యాట్స్‌మన్ దృష్టిని మరల్చడం, మోసగించడం, ఆటంకం కలిగించినట్లయితే.. అంపైర్లు అలా భావిస్తే.. ఇరు జట్ల కెప్టెన్లకు ఈ విషయాన్ని తెలియజేసి 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. అంటే బాధిత జట్టుకు 5 పరుగులు అదనంగా కలుపుతారు. ఇదే నిన్నటి మ్యాచ్‌లో జరిగి ఉంటే ఫకార్ జమాన్ ఔటయ్యేవాడు కాదు. అలాగే పాక్‌కు స్కోర్‌లో 5 పరుగులు ఉచితంగా కలిసి.. అవి ఫలితంపై ప్రభావం చూపేవి. ఇప్పుడు ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ అభిమానులు డికాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Monday, April 5, 2021, 8:49 [IST]
Other articles published on Apr 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X