
ఇక ధోనీ విధ్వంసానికి రాజస్థాన్ రాయల్స్ బౌలర్ టామ్ కరన్ బలయ్యాడు. అతను వేసిన ఆఖరి ఓవర్‌లో మూడో బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడిన మహీ..ఆ వెంటనే మరో రెండు భారీ సిక్సర్లు కొట్టారు. ఇందులో రెండు సిక్స్ అయితే ఏకంగా మైదానం బయటపడింది. 92 మీటర్ల దూరంలో పడిన ఈ బంతిని ఓ వ్యక్తి మురిపంగా తన ఇంటికి తీసుకెళ్లడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఐపీఎల్ ట్విటర్‌రో పంచుకోగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక మహీ సూపర్ ఇన్నింగ్స్‌పై ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాల ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ధోనీ ఈ మ్యాచ్‌లో 17 బంతుల్లో 3 సిక్సర్లతో 29 రన్స్ చేశాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' సంజూ శాంసన్ (32 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్సర్లతో 74) దూకుడుకు తోడు కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్మిత్ (47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 69), జోఫ్రా ఆర్చర్ (8 బంతుల్లో 4 సిక్సర్లతో 27 నాటౌట్) చెలరేగడంతో ఈ స్కోరు సాధ్యమైంది. శాంసన్, స్మిత్ రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 121 పరుగులు జోడించారు. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. చహర్, ఎంగిడి, చావ్లా తలో వికెట్ తీశారు.
అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి 16 పరుగులతో ఓడింది. డుప్లెసిస్ (37 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లతో 72) అర్ధ సెంచరీ సాధించగా... షేన్ వాట్సన్ (21 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 33) ఫర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, టామ్ కరణ్ తలో వికెట్ తీయగా.. రాహుల్ తెవాటియా 3 వికెట్లు పడగొట్టాడు. ధాటైన ఇన్నింగ్స్ ఆడిన శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందింది.