న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్యాన్స్ పుల్ ఖుషీ: డివిలియర్స్ ఐపీఎల్ భవిష్యత్తుపై ఆర్‌సీబీ ట్వీట్

By Nageshwara Rao
Royal Challengers Bangalore give a major update on AB de Villiers’ IPL future

హైదరాబాద్: తన అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. డివిలియర్స్ నిర్ణయంపై క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.

డివిలియర్స్ సంచలన నిర్ణయం: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలుడివిలియర్స్ సంచలన నిర్ణయం: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తాను వైదొలగుతున్నట్లు బుధవారం తన ట్విట్టర్‌‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు. అందులో 'తక్షణమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా. 114 టెస్టు మ్యాచ్‌లు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాను. ఇతరులకు అవకాశం ఇచ్చే సమయం ఇది. ప్రస్తుతం నా వంతు వచ్చింది. నేను అలసిపోయానని నిజాయతీగా చెబుతున్నాను. నేను రిటైర్ అవుతున్నా' అని తెలిపాడు.

అదే సమయంలో దేశవాళీ క్రికెట్లో టైటాన్స్‌ జట్టుకు అందుబాటులో ఉంటానని, డుప్లెసిస్‌కు, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు పూర్తి మద్దతుగా నిలవాలనుకుంటున్నట్లు ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మెట్లకు వీడ్కోలు పలికినప్పటికీ, ఐపీఎల్ విషయంలో డివిలియర్స్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

360 డిగ్రీల సక్సెస్ లభించాలి: డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై సచిన్360 డిగ్రీల సక్సెస్ లభించాలి: డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై సచిన్

డివిలియర్స్ లేని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని ఊహించుకోవడం కష్టమే. ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఇద్దరూ రెండు పిల్లర్లు లాంటివారు. గత కొన్ని సీజన్లలో డివిలియర్స్, విరాట్ కోహ్లీలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒంటిచేత్తో అనేక విజయాలను అందించారు.

అలాంటిది బుధవారం నాడు డివిలియర్స్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌లో అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఓ ప్రశ్నగా మారింది. ఆర్‌సీబీ అభిమానులతో పాటు ఐపీఎల్‌లోని మిగితా జట్లకు చెందిన అభిమానులు సైతం డివిలియర్స్ ఐపీఎల్‌లో ఆడాలని బలంగా కోరుకుంటున్నారు.

ఆటకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి: డివిలియర్స్‌పై ప్రశంసల వర్షంఆటకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి: డివిలియర్స్‌పై ప్రశంసల వర్షం

ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ క్రికెట్‌కు డివిలియర్స్ వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో అతడికి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పిన ఆర్‌సీబీ, ఆ తర్వాత వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు ఏబీకి అందుబాటులో ఉంటాడా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అవును అనే సమాధానమిచ్చింది.

Royal Challengers Bangalore give a major update on AB de Villiers’ IPL future
Story first published: Thursday, May 24, 2018, 15:55 [IST]
Other articles published on May 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X