సఫారీ గడ్డపై రోహిత్ శర్మ పరుగులు అందుకే చేయలేకపోతున్నాడా..?

Posted By: Subhan
Rohit Sharma will always struggle in South Africa due to his footwork: Kepler Wessels

హైదరాబాద్: పర్యటన మొదలైన దగ్గర్నుంచి రోహిత్ శర్మ ప్రదర్శన పేలవంగా ఉంది. భారత జట్టు అన్ని ఓటములకు ప్రధాన కారణంగా మారాడు. ఈ నేపథ్యంలో ప్రముఖులందరూ రోహిత్‌ను విమర్శిస్తున్నారు. ఇటీవలే అతని వైఫల్యాలకు కారణాన్ని దక్షిణాఫ్రికా జట్టు మాజీ కెప్టెన్ వెస్సల్స్ ఈ విధంగా పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాలో రోహిత్ విఫ‌ల‌మ‌వ‌డానికి కార‌ణం అత‌ని పుట్‌వ‌ర్కేన‌ని వెస్స‌ల్స్ అభిప్రాయ‌ప‌డుతున్నాడు.

భార‌త్‌లోని ఫ్లాట్‌పిచ్‌ల‌పై రోహిత్‌కు ఎలాంటి స‌మ‌స్యా ఉండ‌దు. అలాగే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాల్లో కూడా రోహిత్ భారీగా ప‌రుగులు చేయ‌గ‌ల‌డు. ఎందుకంటే అక్క‌డ బౌన్స్ మాత్ర‌మే ఉంటుంది. ద‌క్షిణాఫ్రికాలో బౌన్స్‌తోపాటు పేస్‌ను కూడా ఎదుర్కోవాలి. అందుకు అవ‌స‌ర‌మైన ఫుట్‌వ‌ర్క్ రోహిత్‌కు లేదు. ఆఫ్‌సైడ్ ఆడేట‌పుడు అత‌ని స్టాన్స్ సరిగా ఉండ‌డం లేదు. అందువ‌ల్లే ద‌క్షిణాఫ్రికాలో రోహిత్ ప‌రుగులు చేయ‌లేకపోతున్నాడ‌ని వెస్స‌ల్స్ చెప్పాడు.

వన్డే చరిత్రలోనే మ‌రో బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాని రీతిలో మూడు డ‌బుల్ సెంచ‌రీలు సాధించిన ఘ‌న‌త‌ టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ సొంతం. క‌ష్ట‌సాధ్య‌మైన ఆస్ట్రేలియా పిచ్‌ల‌పైనా దాదాపు 52 శాతం స‌గ‌టుతో ప‌రుగులు చేశాడు. కోహ్లీ కూడా భ‌య‌ప‌డే ఇంగ్లండ్ పిచ్‌ల‌పై రోహిత్ 53.4 సగ‌టుతో రాణించాడు.

అయితే ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో మాత్రం రోహిత్ ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్నాడు. రోహిత్‌కు ఇది మూడో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌. ఈ మూడు ప‌ర్య‌టన‌ల్లోనూ రోహిత్ దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. దీనికి గ‌ల కార‌ణం ఏంటో ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కెప్ల‌ర్ వెస్స‌ల్స్ వివ‌రించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 13, 2018, 15:03 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి