న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై- చెన్నై ఆల్ టైమ్ ఎలెవన్ ప్రకటించిన రోహిత్, రైనా.. కెప్టెన్ ఎవరంటే?

 Rohit Sharma, Suresh Raina Select Their Joint Chennai Super Kings-Mumbai Indians Playing XI Of All-time
Rohit Sharma & Suresh Raina Picks All-Time CSK & MI Combined XI

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆ టీమ్స్ సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ముంబై ఇండియన్స్ అత్యధికంగా నాలుగు ఐపీఎల్ టైటిళ్లను సొంతం చేసుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు విజేతగా నిలిచింది. ఈ ఇరు జట్ల మధ్య పోరు ఆద్యాంతం రసవత్తరంగా ఉంటుంది. విజయం కోసం మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు చేసే పోరాటం.. ఆఫ్ ఫీల్డ్‌లో అభిమానుల మధ్య నడిచే మాటల యుద్దం ఆసక్తికరంగా ఉంటుంది. గత 12 ఏళ్ల చరిత్రలో ఇరు జట్లు ఎన్నో చిరస్మరణీయ మ్యాచ్‌లు ఆడాయి.

ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో..

ఇన్‌స్టా లైవ్ సెషన్‌లో..

అయితే అలాంటి సమఉజ్జీలుగా ఉన్న జట్ల నుంచి అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది.? ఇదే ఆలోచనతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా చెన్నై-ముంబై ఆల్‌టైమ్ ఎలెవన్ టీమ్ ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ స్టార్ క్రికెటర్లు.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో చిట్‌చాట్ చేశారు. క్రికెట్‌కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ధోనీనే కెప్టెన్..

ధోనీనే కెప్టెన్..

ఈ నేపథ్యంలో చెన్నై-ముంబై ఆల్‌టైమ్ ఎలెవన్‌ను ఎంపిక చేశారు. అయితే ఈ జట్టులో తామిద్దరు పేర్లు ప్రకటించుకోవద్దని ముందే నిర్ణయించుకున్నారు. ఓపెనర్లుగా మాథ్యూ హెడెన్, సచిన్ టెండూల్కర్‌లను ఎంపిక చేసిన ఈ భారత క్రికెటర్లు.. మూడు, నాలుగు స్థానాల్లో ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడులను తీసుకున్నారు. వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేసిన రైనా-రోహిత్.. ఈ ఆల్‌టైమ్ టీమ్ కెప్టెన్ కూడా అతనేనని ప్రకటించారు. ఆశ్చర్యకరంగా.. మొత్తం నలుగురి ఆల్‌రౌండర్లను తీసుకున్నారు. కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజాలను ఎంపికచేశారు. స్పెషలిస్ట్ బౌలర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, హర్భన్ సింగ్‌లను తీసుకున్నారు.

చెన్నై-ముంబై ఆల్‌టైమ్ టీమ్..

మాథ్యూ హెడెన్, సచిన్ టెండూల్కర్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కీపర్, కెప్టెన్), కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

ధోనీ భవిష్యత్తుపై చర్చిస్తూ..

ధోనీ భవిష్యత్తుపై చర్చిస్తూ..

రైనా, రోహిత్ మధ్య ఎంఎస్ ధోనీ భవితవ్యం గురించి చర్చకు రాగా.. జార్ఖండ్ డైనమైట్ త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తాడని తెలిపారు. రైనా మాట్లాడుతూ... 'చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనింగ్ సెషన్‌లో ధోనీతో కలిసి బ్యాటింగ్ చేశా. మహీ భాయ్ చక్కగా బంతిని హిట్ చేశాడు. ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్నాడా? లేదా? అనిపించింది. చాలా ఫిట్ గా కూడా ఉన్నాడు. కానీ.. ధోనీ మనసులో ఏముందో? అతనికి మాత్రమే తెలుసు. అతని భవిష్యత్ ప్లాన్ ఏంటో చెప్తే మనకీ ఓ క్లారిటీ వస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను.. అతనిలో క్రికెట్ ఇంకా మిగిలి ఉంది' అని అన్నాడు.సురేశ్ రైనా మాటలు విన్న రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. 'ఎంఎస్ ధోనీ మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగితే.. తప్పకుండా టీమిండియాకి ఆడుతాడు. మహీ భాయ్ మళ్లీ ఆడగలడని నా నమ్మకం. తప్పకుండా ఆడుతాడు' అని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, May 13, 2020, 14:50 [IST]
Other articles published on May 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X