న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాకు కావాల్సింది దక్కింది.. ఆ ఒక్కటి కూడా సరిదిద్దుకుంటాం: రోహిత్ శర్మ

Rohit Sharma says Got Everything We Wanted From West Indies Series, Good Sign Moving Forward As Group

కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ల్లో తాము ఆశించినవన్నీ దక్కాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టీ20, వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమ్‌మేనేజ్‌మెంట్ రచించిన అన్ని వ్యూహాలు ఈ సిరీస్‌లో ఫలించాయన్నాడు. వెస్టిండీస్‌తో ఆదివారం ముగిసిన ఆఖరి టీ20లో టీమిండియా 17 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే.

దాంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్.. జట్టు ఆట తీరుపై సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బౌలింగ్ విభాగాన్ని, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ను ప్రశంసించాడు. తమకు ప్రత్యర్థితో పనిలేదని, జట్టుగా అద్భుత ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టిసారిస్తామని చెప్పాడు.

బ్యాటింగ్, బౌలింగ్ డోంట్ కేర్..

బ్యాటింగ్, బౌలింగ్ డోంట్ కేర్..

'ఓ జట్టుగా మేం ముందు బ్యాటింగ్ చేయడానికైనా.. చేజింగ్ చేయడానికైనా సిద్దంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏ సవాళ్లనైనా స్వీకరించేలా జట్టును రెడీ చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మా ఆటను మెరుగుపరుచుకోవడంపై దృష్టిసారించాం. మా మిడిలార్డర్ మార్పులు చేశాం. వ్యూహాలను పక్కాగా అమలు చేశాం.

మేం ఒక్కో అంశాన్ని మెరుగు పరుచుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ సిరీస్‌లో విజయం సాధించడం సంతోషంగా ఉంది. వెస్టిండీస్‌తో రెండు సిరీస్‌ల్లో మేం ఆశించిన ఫలితాలన్నీ దక్కాయి. చాలా మంది ఆటగాళ్లు జట్టుకు దూరమైనా.. విభిన్న సవాళ్లు ఎదురైనా మా ప్రదర్శనలో ఎక్కడా తగ్గలేదు. క్లిష్ట పరిస్థితుల్లో మా ఆటగాళ్లు ఆడిన తీరు ప్రశంసనీయం. ఇలాంటి ప్రదర్శనలనే మేం ఆశించాం. ఇది జట్టుకు శుభపరిణామం.

ఆ ఒక్కటి కూడా..

ఆ ఒక్కటి కూడా..

వన్డే సిరీస్‌లో మిడిలార్డర్ బ్యాటింగ్ మెరుగుపడింది. అది అలానే టీ20 సిరీస్‌లో కూడా కొనసాగింది. పేస్ బౌలింగ్‌ నన్ను బాగా ఆకట్టుకుంది. అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న ఆవేశ్ ఖాన్.. అంతగా అనుభవం లేని హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్ నిలకడగా రాణించారు. గత రెండు మ్యాచ్‌ల్లో టార్గెట్‌ను కాపాడుకోవడం గొప్ప విషయం. బౌలర్ల వల్లనే ఇది సాధ్యమైంది. శ్రీలంక పర్యటనలో కూడా ఇదే జోరు కొనసాగిస్తాం. ప్రపంచకప్ టోర్నీల నేపథ్యంలో ఆటగాళ్లందరినీ రెడీ చేస్తాం. నేనెప్పుడూ ప్రత్యర్థిని చూడను. జట్టుగా మేం చేయాలనేదానిపైనే దృష్టిసారిస్తా. ఫీల్డింగ్, క్యాచింగ్‌ను కూడా మెరుగుపరుచుకుంటాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

సూర్య సూపరో సూపర్..

సూర్య సూపరో సూపర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో ఫోర్, 7 సిక్స్‌లతో 65) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) అండగా నిలిచాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 91 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు.

విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, షెఫెర్డ్, చేజ్, వాల్ష్, డ్రేక్స్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆ జట్టులో నికోలస్ పూరన్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 61) వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదినా ఫలితం లేకపోయింది.

Story first published: Monday, February 21, 2022, 12:26 [IST]
Other articles published on Feb 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X