న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అభిమానులతోనే ఆటకు అందం: రోహిత్ శర్మ

Rohit Sharma Says Fans Make Sport Look Glamorous
Rohit Sharma - 'Fans Make Sport Look Glamorous'

ముంబై: ఏ క్రీడకైనా అభిమానులతోనే గ్లామరని, వారే ఆటకు అదనపు హంగులు తీసుకొస్తారని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఆట కన్నా ప్రేక్షకుల ఆరోగ్యమే ముఖ్యమన్నా.. పరిస్థితులు కుదుట పడేవరకు వేచి ఉండక తప్పదన్నాడు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా క్రికెట‌ర్లంతా ఇంటికే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ క్వారంటైన్ సమయాన్ని ఆటగాళ్లు ఫ్యామిలీతో గడుపుతూ.. సోష‌ల్‌మీడియా కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో శనివారం ఫెస్‌బుక్‌లో ఫ్యాన్స్‌లో ఇంటరాక్ట్ అయిన రోహిత్.. అభిమానుల గురించి తన మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టాడు.

'ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడకైనా అభిమానులు చాలా ముఖ్యం. వారితో ఏ ఆటకైనా అందం వస్తుంది. కానీ అన్నిటికన్నా ఆరోగ్యమే ముఖ్యం. పరిస్థితిలు కుదుటపడితే స్టేడియంలోకి అభిమానులను అనుమతినిచ్చే అవకాశం ఉంది. ప్ర‌తీ ఒక్క‌రి ర‌క్ష‌ణ‌ను దృష్టిలో పెట్టుకుని త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి అవసరం ఉంది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

Rohit Sharma Says Fans Make Sport Look Glamorous

ప్ర‌పంచ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో స‌డ‌లింపుల‌ను ఇస్తుండ‌టంతో క్రీడా కార్య‌క‌లాపాల‌ను తిరిగి ప‌ట్టాల‌కెక్కించాల‌ని వివిధ దేశాల బోర్డులు భావిస్తున్నాయి. ఇప్ప‌టికే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు త‌మ ప్లేయ‌ర్ల‌కు ట్రైనింగ్ ప్రారంభించింది. మ‌రోవైపు భార‌త ప్రభుత్వం కూడా నిబంధనలతో కూడా అనుమతులిచ్చింది. ఈ నేపథ్యంలోనే పేస‌ర్ శార్దూల్ ఠాకూర్ కూడా బ‌హిరంగంగా త‌న ప్రాక్టీస్‌ను కూడా స్టార్ చేశాడు.

ఇక సమీప భవిష్యత్‌లో ఎలాంటి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వబోదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. దీంతో అక్టోబర్‌-నవంబర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) 2020 సీజన్ జరిగే అవకాశాలున్నాయని వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. దేశంలో క్రీడల పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్నామన్న రిజిజు... అంతకన్నా ముందు ఆట గాళ్ల ప్రాక్టీస్, శిక్షణ, ఫిట్‌నెస్‌ తమకు ముఖ్యమని పేర్కొన్నారు. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే క్రీడా ఈవెంట్లు నిర్వహించేందుకు అలవాటు పడాలని సూచించారు. ఐపీఎల్ గురించి మాట్లాడిన మంత్రి.. దేశంలో ఎెలాంటి టోర్నమెంట్ జరగాలన్నా దానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అన్నారు.

గంభీర్ చాలా టాలెంటెడ్.. కానీ అతని కోపమే కొంపముంచింది : మాజీ క్రికెటర్గంభీర్ చాలా టాలెంటెడ్.. కానీ అతని కోపమే కొంపముంచింది : మాజీ క్రికెటర్

Story first published: Sunday, May 24, 2020, 10:41 [IST]
Other articles published on May 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X