న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేల్లో అత్యంత వేగంగా 200 సిక్సులు: మొత్తంగా ఏడో క్రికెటర్‌గా రోహిత్

India Vs West Indies 2018,5th ODI : Rohit Sharma Quickest To 200 Sixes In ODI | Oneindia Telugu
Rohit Sharma becomes quickest to hit 200 ODI sixes and seventh player to hit more than 200 sixes in ODIs

హైదరాబాద్: తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. 200 సిక్సుల మైలురాయిని రోహిత్ శర్మ 187 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకోవడం విశేషం.

వన్డేల్లో 200కుపైగా సిక్సులు బాదిన ఏడో క్రికెటర్‌గా

వన్డేల్లో 200కుపైగా సిక్సులు బాదిన ఏడో క్రికెటర్‌గా

ఆఖరి వన్డేలో హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో బంతిని లాంగాన్‌లోకి బాదడంతో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది(195 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డుని బద్దలు కొట్టాడు. అంతేకాదు వన్డేల్లో 200కుపైగా సిక్సులు బాదిన ఏడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు

రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు

దీంతో పాటు భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (202)బాదిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో భారత్ తరుపున మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (211 సిక్సులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్రిది, గేల్, జయసూర్య, డివిలియర్స్, మెకల్లమ్‌లు ఈ జాబితాలో ఉన్నారు.

 ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగులు

ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగులు

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 1202 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ 1030 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా ఆరో వన్డే సిరీస్‌ విజయం కావడం విశేషం.

రెండో భారతీయుడిగా ధోని అరుదైన ఘనత

రెండో భారతీయుడిగా ధోని అరుదైన ఘనత

ఈ మ్యాచ్‌తో భారత్‌లో 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రెండో భారతీయుడిగా ధోని అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్‌ 258 మ్యాచ్‌లతో ముందున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో అత్యధిక పరుగులు (453) సాధించిన భారత క్రికెటర్‌గా కోహ్లీ. మొత్తంగా పాక్‌ ఆటగాడు ఫఖర్‌ జమాన్‌(జింబాబ్వేపై 515) అగ్రస్థానంలో ఉన్నాడు.

Story first published: Friday, November 2, 2018, 13:45 [IST]
Other articles published on Nov 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X