న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌తో తొలి టెస్టులో రోహిత్ ఆడనున్నాడా?

India vs Australia 2018,1st Test : Rohit Sharma Will Play First Test Against Australia
Rohit Sharma attends optional practice session, in line to play first Test against Australia

సిడ్నీ: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు జట్టులో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. అడిలైడ్ వేదికగా గురువారం నుంచి జరగనున్న తొలి టెస్టులో ఆడేందుకు భారత టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మకి మార్గం సుగుమమైనట్లు సమాచారం. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ ఏడాది జనవరిలో ఆఖరిగా టెస్టులు ఆడిన రోహిత్ శర్మ.. పేలవ ఫామ్‌ కారణంగా ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. రాణిస్తాడని భావించినా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో టెస్టులకు దూరమైయ్యాడు.

సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తోన్న రోహిత్

సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తోన్న రోహిత్

ఈ క్రమంలో అతడిపై వేటు వేసిన సెలక్టర్లు.. ఆ తర్వాత అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లకి ఎంపిక చేయలేదు. ఆ సిరీస్‌లో అజింక్య రహానెని పక్కన పెట్టి మరీ రోహిత్ శర్మకి అవకాశమిశ్వగా.. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రోహిత్ శర్మ చేసిన పరుగులు 78 మాత్రమే. అయితే.. సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తోన్న వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇటీవల వన్డే, టీ20ల్లో ఈ హిట్టర్ సెంచరీ మోత మోగిస్తున్నాడు. దీంతో రోహిత్‌ను మళ్లీ దాదాపు 10 నెలల తర్వాత ఐదు రోజుల ఫార్మాట్‌లోకి సెలక్టర్లు ఎంపిక చేశారు.

 రోహిత్, విహారీల మధ్య తీవ్రమైన పోటీ

రోహిత్, విహారీల మధ్య తీవ్రమైన పోటీ

వన్డే, టీ20ల్లో ఓపెనర్‌గా ఆడే రోహిత్.. టెస్టుల్లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ జట్టు మిడిలార్డర్‌లో ఒక స్థానం కోసం ఇప్పుడు రోహిత్ శర్మ, హనుమ విహారీ మధ్య పోటీ నెలకొంది. అయితే విహారి కంటే బాగా రాణిస్తాడని భావించిన టీమిండియా మేనేజ్‌మెంట్ రోహిత్‌కే ఎక్కువ మొగ్గు చూపనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లాండ్‌‌పై టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన హనుమ విహారి.. తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాదడంతో పాటు.. 3 వికెట్లను కూడా పడగొట్టాడు.

 బ్యాక్‌ఫుట్‌పై ఆడే ఆటగాళ్లకే అనుకూలంగా

బ్యాక్‌ఫుట్‌పై ఆడే ఆటగాళ్లకే అనుకూలంగా

ఎందుకంటే.. ఈ ఏడాది జనవరిలో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత కనీసం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ లేదా భారత్ -ఎ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ, ఇటీవల వన్డే, టీ20ల్లో వరుస సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో సీనియర్ బ్యాట్స్‌మెన్ కావడం, బ్యాక్‌ఫుట్‌పై ఆడగలిగే సామర్థ్యం ఉండటంతో రోహిత్‌కే ఛాన్స్ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఆస్ట్రేలియా గడ్డపై పిచ్‌లు బ్యాక్‌ఫుట్‌పై ఆడే ఆటగాళ్లకే అనుకూలంగా ఉంటాయి.

Story first published: Tuesday, December 4, 2018, 17:30 [IST]
Other articles published on Dec 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X