న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాట్ కేకుల్లా ఐదో వన్డే టికెట్లు: కేసీఏకు రూ.3 కోట్లు ఆదాయం

Rival teams arrive as ticket sales peak for last ODI

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఆఖరి వన్డే గురువారం తిరువనంతపురం వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. చివరి వన్డే కావడంతో వన్డే టికెట్లకు ఫుల్‌ డిమాండ్‌ ఉందని కేరళ క్రికెట్‌ ఆసోసియేషన్‌(కేసీఏ) తెలిపింది.

రోహిత్ అని కాదు.. ఇండియా అని అరవండి(వీడియో)రోహిత్ అని కాదు.. ఇండియా అని అరవండి(వీడియో)

ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన ఈ సిరీస్‌ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేరళ క్రికెట్‌ ఆసోసియేషన్‌(కేసీఏ) సైతం భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

 ఐదో వన్డే టికెట్లు హాట్ కేకుల్లా

ఐదో వన్డే టికెట్లు హాట్ కేకుల్లా

ముఖ్యంగా విద్యార్థులకు 50 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. దీంతో ఐదో వన్డే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. 40వేల సీటింగ్‌ సామర్ధ్యం ఉన్న ఈ మైదానంలో మంగళవారానికే 30వేల టికెట్లు అమ్ముడుపోయాయని, మ్యాచ్‌ ప్రారంభమయ్యే రోజువరకు అన్ని టికెట్లు అమ్ముడుపోతాయని కేసీఏ అధికారులు పేర్కొన్నారు.

టికెట్ల అమ్మకాల ద్వారా రూ.3 కోట్లు ఆదాయం

ఇప్పటివరకు టికెట్ల అమ్మకాల ద్వారా రూ.3 కోట్లు ఆదాయం వచ్చిందని కేసీఏ అధికారులు తెలిపారు. మరోవైపు విద్యార్థులు భారీగా టికెట్లు కొనుగోలు చేయడంతో తప్పనిసరిగా ఐడీకార్డులు తీసుకురావాలని స్టేడియం నిర్వాహకులు సూచించారు. ఐదో వన్డే కోసం ఇప్పటికే ఇరు జట్లు కేరళకు చేరుకున్నాయి.

విమానాశ్రయంలో ఇరు జట్ల ఆటగాళ్లకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్న ఆటగాళ్లకు కేరళ సంప్రదాయక వాయిద్యాలతో కొంతమంది కళాకారులు చేసిన ప్రదర్శన అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఘనస్వాగతం

ఇంతటి ఘనస్వాగతం పలికిన అభిమానులకు ప్రత్యేక ధనవాద్యాలంటూ బీసీసీఐ ట్వీట్‌ చేసింది. మరోవైపు వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు కూడా తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియోను పంచుకుంది. కేరళను చూస్తుంటే మా దేశం గుర్తుకు వస్తుందంటూ వీడియో కింద రాసుకొచ్చింది.

Story first published: Wednesday, October 31, 2018, 12:56 [IST]
Other articles published on Oct 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X