న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rinku Singh: గెలిపించలేదనే బాధతో కన్నీటి పర్యంతమైన కేకేఆర్ హిట్టర్! (వీడియో)

Rinku Singhs emotional reaction after heartbreaking last-over dismissal goes viral

ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ హిట్టర్ రింకూ సింగ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టును గెలిపించలేకపోయాననే బాధతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ఐపీఎల్ 2022 సీజన్‌ నుంచి నిష్క్రమించింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ విధించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోల్‌కతా గొప్ప పోరాటాన్ని కనబర్చింది.

విధ్వంసకర ఇన్నింగ్స్‌తో...

ముఖ్యంగా రింకూ సింగ్ ( 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40) ధాటిగా కోల్‌కతాను గెలిపించేలా కనిపించాడు. కానీ.. చివరి ఓవర్‌లో ఐదో బంతికి అతను ఎవిన్ లూయిస్ స్టన్నింగ్ క్యాచ్‌కు అతను వెనుదిరగ్గా.. ఆఖరి బంతికి ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డవడంతో కోల్‌కతా ఓడిపోయింది. దాంతో.. రింకు సింగ్ గ్రౌండ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోల్‌కతా జట్టులో గత ఐదేళ్లుగా ఉన్న రింకు సింగ్‌కి ఈ ఏడాదే వరుసగా తుది జట్టులో అవకాశాలు దక్కాయి. ఈ క్రమంలో ఇప్పటికే రాజస్థాన్‌ రాయల్స్‌తో కోల్‌కతాను గెలిపించిన రింకూ సింగ్.. బుధవారం రాత్రి కూడా టీమ్‌ని గెలిపించేందుకు చాలా కష్టపడ్డాడు.

దు:ఖాన్ని ఆపుకోలేక..

మరీ ముఖ్యంగా.. చివరి 6 బంతుల్లో 21 పరుగులు అవసరమైన దశలో మార్కస్ స్టోయినిస్‌కు 4,6,6,2 చుక్కలు చూపించాడు. కానీ.. ఐదో బంతికి ఎవిన్ లూయిస్ ఒంటిచేత్తో పట్టిన డైవ్ క్యాచ్‌కు రింకూ వెనుదిరగాల్సి వచ్చింది. దాంతో.. పెవిలియన్‌కి వెళ్తూ రింకు సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం కూడా రింకూ సింగ్ ఓటమి బాధను తట్టుకోలేకపోయాడు. ఇది గమనించిన సహచరులు అతడ్ని ఓదార్చే ప్రయత్నం చేసినా.. ఉబికి వస్తున్న కన్నీటిని దాచుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోల్‌కతా ఓడినా.. రింకూ సింగ్ మనసులు గెలుచుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సూపర్ డూపర్ మ్యాచ్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్వింటన్ డికాక్(70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 నాటౌట్) భారీ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీశ్ రాణా(22 బంతుల్లో 9 ఫోర్లతో 42), సామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), రింకూ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40) ధాటిగా ఆడారు. లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, మార్కస్ స్టోయినీస్ మూడేసి వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, May 19, 2022, 14:14 [IST]
Other articles published on May 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X