న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ అవార్డుకు విరాట్ కోహ్లీనే అర్హుడు.. సామ్ కరణ్ కంటే గొప్పగా ఆడాడు: రికీ పాంటింగ్

Ricky Ponting Says Virat Kohli Is My Player Of The Tournament After Sam Curran Bags Award

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇవ్వాల్సిందని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. తన దృష్టిలో విరాట్ కోహ్లీనే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అని అభిప్రాయపడ్డాడు. ఇక అసాధారణ బౌలింగ్‌తో ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.

ఈ రెండు గెలిచిన తొలి ప్లేయర్‌గా సామ్ కరన్ చరిత్రకెక్కాడు. ఈ మెగా టోర్నీలో మొత్తం 13 వికెట్లు తీసిన సామ్ కరన్.. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు.

కోహ్లీకే ఇవ్వాల్సింది..

కోహ్లీకే ఇవ్వాల్సింది..

అయితే సామ్ కరన్ కంటే విరాట్ కోహ్లీనే అద్భుత ప్రదర్శన కనబర్చాడని రికీ పాంటింగ్ అన్నాడు. 98.67 సగటుతో పరుగులు చేసిన విరాట్‌ కోహ్లీని పట్టించుకోకపోవడం సరికాదని నిర్వాహకులను తప్పుబట్టాడు. పాకిస్థాన్‌తో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్.. క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయమైనదని కొనియాడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతను బ్యాటింగ్ చేసిన తీరు అమోఘమని, అతనికే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ఈ మెగా టోర్నీకే హైలైట్..

ఈ మెగా టోర్నీకే హైలైట్..

'గొప్ప ఆటగాళ్లు, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకుని గొప్పగా ఆడతారు. పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్.. ఈ వరల్డ్ కప్ టోర్నీకే హైలైట్. నా వరకూ విరాట్‌ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ టాపార్డర్ ఫెయిల్ అయ్యాక విరాట్ బాధ్యత తీసుకుని ఆడాడు.' అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ను అసాధారణ బ్యాటింగ్‌తో ఒంటి చేత్తో గెలిపించిన విరాట్ కోహ్లీ.. మొత్తం 6 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలు చేసి 296 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

సచిన్ తర్వాత..

సచిన్ తర్వాత..

2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 319 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సచిన్ టెండూల్కర్ వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఈ ఫీట్ సాధించాడు. 1996, 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత విరాట్ కోహ్లీ రెండు సార్లు ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు...

 రెండో ఇంగ్లండ్ ప్లేయర్‌గా..

రెండో ఇంగ్లండ్ ప్లేయర్‌గా..

2007లో ఇర్ఫాన్ పఠాన్, 2008లో షాహీద్ ఆఫ్రిదీ, 2010లో క్రెగ్ కెస్వీట్టర్, 2012లో మార్లోన్ శామ్యూల్స్, 2014లో కుమార సంగర్కర, 2015లో మార్లోన్ శామ్యూల్స్, 2021లో మిచెల్ మార్ష్... టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో 'ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్' గెలిచారు. ఇర్ఫాన్ పఠాన్ తర్వాత ఈ అవార్డు గెలిచిన లెఫ్టార్మ్ పేసర్‌గా నిలిచాడు సామ్ కరన్.

2007లో షాహీది ఆఫ్రిదీ, 2009లో తిలకరత్నే దిల్షాన్, 2010లో కేవిన్ పీటర్సన్, 2012లో షేన్ వాట్సన్, 2014, 2016 టోర్నీల్లో విరాట్ కోహ్లీ, 2021లో డేవిడ్ వార్నర్.. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డులు గెలిచారు. కేవిన్ పీటర్సన్ తర్వాత ఈ అవార్డు గెలుచుకున్న రెండో ఇంగ్లాండ్ ప్లేయర్ సామ్ కరాన్.

Story first published: Monday, November 14, 2022, 13:43 [IST]
Other articles published on Nov 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X